Viral Video: ఒక క‌ప్ప‌.. రెండు పాముల మ‌ధ్య ఫైట్‌. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Viral Video: పాములకు ఎలుకలు, కప్పలు వంటి చిన్న జీవులు ఎంతో ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా పంట పొలాలు, పొదల ప్రాంతాల్లో ఈ జంతువులు ఎక్కువగా కనిపించడంతో, పాములు తరచూ అక్కడే సంచరిస్తుంటాయి.

Update: 2025-06-05 12:30 GMT

Viral Video: ఒక క‌ప్ప‌.. రెండు పాముల మ‌ధ్య ఫైట్‌. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Viral Video: పాములకు ఎలుకలు, కప్పలు వంటి చిన్న జీవులు ఎంతో ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా పంట పొలాలు, పొదల ప్రాంతాల్లో ఈ జంతువులు ఎక్కువగా కనిపించడంతో, పాములు తరచూ అక్కడే సంచరిస్తుంటాయి. ఇటీవల పాములపై తీసిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఆసక్తిగా ఉన్నారు.

తాజాగా రెండు పాములు ఒకే సమయంలో ఒక కప్పను తమ ఆహారంగా మార్చేందుకు ప్రయత్నించిన దృశ్యాలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అడవిలో ఒక కప్పను ఒకే స‌మ‌యంలో రెండు పాములు దాన్ని ఒకేసారి గమనించాయి. తర్వాత అదే సమయంలో దాని మీద దాడికి దిగాయి. ఒక్కసారిగా ఎదురైన ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు కప్ప త‌న శక్తిని కూడగట్టి పోరాడింది.

పాములు దాన్ని పట్టుకొని లాగేందుకు ఎంతగానో ప్రయత్నించాయి. కానీ కప్ప వాటి పట్టుకు లోనవకుండా చివరి వరకు గట్టిగా ప్రతిఘటించింది. చివరికి ఆ కప్ప పాముల నుంచి బయటపడినట్లు వీడియోలో కనిపిస్తుంది. దీనంత‌టినీ వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం నెటిజ‌న్ల‌ను షేక్ చేస్తున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.



Tags:    

Similar News