Viral video: వరద నీటిలో అనుకోని అతిథి.. చూస్తే గుండె జారిపోవాల్సిందే
Viral video: భారీ వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచిపోవడం కామన్. అయితే రోడ్డు దాటుతున్నప్పుడు కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సాధారనంగా గుంతల్లో పడిపోతుంటాం. అయితే ముంబైలో జరిగిన ఓ సంఘటన మాత్రం గుండె జారెంత పని చేసింది.

వర్షాలు మొదలైతే రోడ్లపై నీరు చేరడం, ట్రాఫిక్ సమస్యలు, మ్యాన్‌హోల్స్ కనిపించకపోవడం వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కానీ నవీ ముంబైలో ఒక రోడ్డుపై వరద నీరు చేరింది. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు రోడ్డును దాటి వెళ్తుండగా, ఫుట్‌పాత్ పక్కనే ఓ పెద్ద కొండచిలువ (Python) తల పైకి పెట్టి పడుకుని ఉండటం కనిపించింది. కొండచిలువను చూసిన వెంటనే అక్కడున్నవారు భయంతో వెనక్కి నడిచారు. అయితే అది ఏం చేయకపోవడంతో ఎవరూ గాయపడలేదు. కొంత సమయం పాటు అది కదలకుండా అక్కడే ఉండిపోయింది.
ఈ దృశ్యాన్ని కొంతమంది ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకపై వరద నీటిలో నడవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.