Viral: గ్రాము తేలు విషం ధర రూ. 8.6 లక్షలు.. ఇంతకీ దాంతో ఏం చేస్తారనేగా?
Scorpion Venom: తేలు కాటుతో చనిపోతారన్న భయం మనకు ఉంటుంది. కానీ అదే తేలు నుంచి వచ్చే విషం.. ప్రాణాలు నిలబెట్టే మందుల తయారీలో ఉపయోగపడుతోందని మీకు తెలుసా? ప్రాణాంతకంగా కనిపించే తేలు విషం.. ఇప్పుడంతే ఖరీదైన, వినూత్న వ్యాపార మార్గంగా మారుతోంది.
Viral: గ్రాము తేలు విషం ధర రూ. 8.6 లక్షలు.. ఇంతకీ దాంతో ఏం చేస్తారనేగా?
Scorpion Venom: తేలు కాటుతో చనిపోతారన్న భయం మనకు ఉంటుంది. కానీ అదే తేలు నుంచి వచ్చే విషం.. ప్రాణాలు నిలబెట్టే మందుల తయారీలో ఉపయోగపడుతోందని మీకు తెలుసా? ప్రాణాంతకంగా కనిపించే తేలు విషం.. ఇప్పుడంతే ఖరీదైన, వినూత్న వ్యాపార మార్గంగా మారుతోంది. ఒక్క గ్రాము తేలు విషం ధర ఇప్పుడు రూ.8.6 లక్షలు పలుకుతోంది.
తేలు విషం అంత ఖరీదెందుకు?
తేలు విషాన్ని సేకరించడం చాలా కష్టమైన ప్రక్రియ. ఒక్క తేలులో కేవలం 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే ఉంటుంది. అంటే 1 గ్రాము విషం కోసం వందల తేళ్లు కావాలి. పైగా ఈ విషాన్ని సేకరించడానికి ఎలక్ట్రిక్ స్టిములేషన్ అనే ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఈ పద్ధతి ఖరీదైనదే కాక, శ్రమతో కూడినదిగా ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలలో ఒకటిగా మారింది.
తేలు విషాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు.?
ఈ విషం ప్రధానంగా వైద్య రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ప్రధానంగా.. మెదడు క్యాన్సర్ కణితులను గుర్తించడానికి, శక్తివంతమైన నొప్పి నివారక మందుల తయారీకి, ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో, యాంటీబయోటిక్స్ తయారీలో, బ్యూటీ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ రంగాల్లో, పురుగుమందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. తేలు విషంలో ఉండే క్లోరోటాక్సిన్ (Chlorotoxin) అనే ప్రోటీన్ మెదడు ట్యూమర్లను గుర్తించడంలో ఉపయోగపడుతుంది.
తేలు విషం ఎక్కువగా లభించే దేశాలు?
ప్రపంచవ్యాప్తంగా తేలు విషం ఉత్పత్తిలో ఈజిప్ట్, టర్కీ, ఇరాన్ దేశాలు ముందున్నాయి. ఇవి సాధారణంగా ఎడారి వాతావరణంలో ఉండే దేశాలు. అక్కడ తేళ్లు ఎక్కువగా దొరుకుతాయి. పైగా ఎడారి తేళ్ల విషం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ దేశాల్లో తేళ్లను వైద్యపరంగా వాడేందుకు పెంచే ఫామ్‌లు కూడా ఉన్నాయి.
ఇండియా విషయానికొస్తే.. ఇక్కడ తేలు విషం సేకరణ ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే జరుగుతోంది. కానీ ఇది ఒక పెద్ద పరిశ్రమగా మారే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి.?
తేళ్ల పెంపకం అనేది ఒక గొప్ప బిజినెస్ అవకాశంగా చెప్పొచ్చు. ఈ రంగంలో స్టార్ట్‌అప్ మొదలుపెట్టాలంటే రూ.35 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు పెట్టుబడి అవసరం. తేలు పెంపకం కోసం ప్రత్యేక శిక్షణ, వాతావరణం, విష సేకరణ టెక్నాలజీ అవసరం. ఉత్పత్తైన విషాన్ని యూరప్, అమెరికా వంటి దేశాల్లోని ఫార్మా కంపెనీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.