Viral Video: స్కూల్ పిల్లల చేతికి మహీంద్రా XUV700 కారు... పేరెంట్స్‌ను కడిగిపారేస్తున్న నెటిజెన్స్

School students driving Mahindra XUV700 SUV car: ఒక స్కూల్ విద్యార్థి మహీంద్రా XUV700 కారు నడుపుతున్న వీడియో చూసి నెటిజెన్స్..

Update: 2025-03-13 09:42 GMT

Viral Video: స్కూల్ పిల్లల చేతికి మహీంద్రా XUV700 కారు... పేరెంట్స్‌ను ఏకిపారేస్తున్న నెటిజెన్స్

School Kids driving Mahindra XUV700 SUV car: స్కూల్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి, ఎంత బాధ్యతగా ఉండాలి అనే విషయంలో కొంతమంది పేరెంట్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంత వయసొచ్చినా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే ఎవ్వరూ వాహనాలు డ్రైవ్ చేయకూడదు అని ట్రాఫిక్ నిబంధనలు చెబుతున్నాయి. కానీ కొంతమంది పేరెంట్స్ చిన్న పిల్లల చేతికే వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారు. అనేక సందర్భాల్లో వారు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఆ ప్రమాదాల్లో కొన్నిసార్లు కారు నడిపిన వారే ప్రాణాలు కోల్పోతుండగా ఇంకొన్నిసార్లు ఎదుటివారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది ఒక స్కూల్ విద్యార్థి మహీంద్రా XUV700 కారు నడుపుతున్న వీడియో. ఆ వాహనంలో ముందు, వెనుక అంతా స్కూల్ పిల్లలు కూర్చుని ఉన్నారు. డివైడర్ లేని చోట ట్రాఫిక్‌లో వారు ఆ కారు డ్రైవ్ చేయడం వీడియోలో చూడొచ్చు. వారి తీరు చూస్తే అంతా 10వ తరగతి లేదా ఆ లోపు వయసు పిల్లలే అని అర్థం అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో పుల్ ఫైర్ అవుతున్నారు. ఇలా పిల్లలకు పెద్దపెద్ద SUV వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తే వారి కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని నెటిజెన్స్ మండిపడుతున్నారు.

మీకు ఎంత డబ్బుంటే మాత్రం మరీ స్కూల్ పిల్లలకు ఇలా మహీంద్రా XUV700 లాంటి పెద్ద SUV కారు ఇచ్చి పంపుతారా అని ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు... ఆ కారులో ఎక్కి కూర్చొన్న పిల్లల భవిష్యత్ కూడా ఆ పిల్లోడి చేతిలోనే ఉంది కదా అని ఇంకొంతమంది నెటిజెన్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

స్కూల్ పిల్లల చేతికి కారు ఇచ్చి పంపించిన ఆ పేరెంట్స్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఆ కారును సీజ్ చేయాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే కానీ ఆ తల్లిదండ్రులకు బుద్ది రాదు అని వారు అభిప్రాయపడుతున్నారు.

గతంలోనూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఇలాంటి వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆయా ఘటనల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులు కారు నెంబర్ల ఆధారంగా వారికి భారీ మొత్తంలో ఛలాన్లు పంపించడం, ఇంకొన్ని ఘటనల్లో కార్లను సీజ్ చేయడం లాంటివి జరిగాయి. ఈ విషయంలో కూడా అలా జరిగే అవకాశం లేకపోలేదు.   

Tags:    

Similar News