Sankranti 2026: సంక్రాంతి సంబరం.. బరిలో దిగే 'పందెం కోళ్లు' ఎన్ని రకాలో తెలుసా? కుక్కుట శాస్త్రం ఏం చెబుతోంది!

Sankranti 2026: సంక్రాంతి కోడి పందాలకు సర్వం సిద్ధం! కుక్కుట శాస్త్రం ప్రకారం కోడి పుంజుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? కాకి, సేతు, డేగ, నెమలి.. ఇలా రంగుల ఆధారంగా పందెం కోళ్ల జాతుల పూర్తి వివరాలు.

Update: 2026-01-08 04:30 GMT

Sankranti 2026: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. కొత్త అల్లుళ్లు, భోగి మంటలు, గంగిరెద్దుల సందడితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు మొదలైంది. ఇది కేవలం పందెం మాత్రమే కాదు, ఒక ప్రాంతీయ భావోద్వేగం. ఈ పందెం కోళ్లను ఎంపిక చేయడంలో, వాటిని పెంచడంలో 'కుక్కుట శాస్త్రం' (Kukuta Shastram) కీలక పాత్ర పోషిస్తుంది.

రంగుల ఆధారంగా కోడి పుంజుల రకాలు:

కుక్కుట శాస్త్రం ప్రకారం కోడి పుంజుల ఈకల రంగు, కాళ్లు, కళ్ల రంగులను బట్టి వాటిని వివిధ జాతులుగా వర్గీకరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం:

కాకి కోడిపుంజు: శరీరం మొత్తం గాఢమైన నల్లని ఈకలతో ఉంటుంది.

సేతు కోడిపుంజు: ఈ జాతి కోడి పుంజులు పూర్తిగా తెల్లటి ఈకలతో కనువిందు చేస్తాయి.

డేగ కోడిపుంజు: డేగ రంగును పోలి ఉండి, ఎర్రటి ఈకలతో అత్యంత ఆకర్షణీయంగా, పౌరుషంగా కనిపిస్తుంది.

నెమలి కోడిపుంజు: వీపు భాగంలో పసుపు రంగు ఈకలు ఉండి, నెమలి పింఛం తరహా రంగుల కలయికను కలిగి ఉంటుంది.

పర్ల కోడిపుంజు: మెడ భాగంలో నలుపు, తెలుపు రంగుల ఈకలు కలిసి ఉంటాయి.

సవల కోడిపుంజు: మెడపై పూర్తిగా నల్లని ఈకలు ఉండటం దీని ప్రత్యేకత.

కొక్కిరాయి: శరీరం ఎక్కువగా నల్లగా ఉన్నా, అక్కడక్కడ రెండు మూడు రంగుల ఈకలు మెరుస్తుంటాయి.

పింగళ: రెక్కలు తెలుపు రంగులో ఉండి, అక్కడక్కడా నలుపు, గోధుమ రంగు చుక్కలు కనిపిస్తాయి.

ముంగిస: దీని జూలు మరియు శరీర రంగు ముంగిస జంతువు రంగును పోలి ఉంటుంది.

అబ్రాసు: లేత బంగారు రంగు (Golden Color) ఈకలతో మెరిసిపోతూ ఉంటుంది.

మైల: ఎరుపు మరియు బూడిద (Ash) రంగుల కలయికతో ఈ జాతి ఉంటుంది.

పందెంలో గెలుపు గుర్రాలు ఏవి?

పందెం కట్టేటప్పుడు కేవలం రంగునే కాదు.. ఆ రోజు వారము, తిథి, నక్షత్రం మరియు ఏ సమయంలో ఏ రంగు కోడికి 'బలం' ఎక్కువగా ఉందో కుక్కుట శాస్త్రం ద్వారా విశ్లేషిస్తారు. అందుకే పందెం రాయుళ్లు ఈ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటిస్తుంటారు.


కోడి రకంప్రధాన లక్షణం
కాకినల్లని ఈకలు
డేగఎర్రటి ఈకలు
సేతుతెల్లటి ఈకలు
కౌజునలుపు, ఎరుపు, పసుపు మిశ్రమం


Tags:    

Similar News