Samsung Galaxy F41: స‌మ్‌సాంగ్ నుంచి త‌క్కువ ధ‌ర‌లోనే.. అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌

Samsung Galaxy F41: స్మార్ట్ ఫోన్ల‌ దిగ్గ‌జం సామ్‌సంగ్.. భార‌త మార్కెట్ లోకి వ‌రుస‌గా త‌న ఫోన్లను లాంచ్ చేస్తుంది. తాజాగా ఎఫ్ సిరీస్‌లో మ‌రో ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే సామ్‌సంగ్ ఎఫ్ 41.

Update: 2020-09-16 18:24 GMT

Samsung Galaxy F41

Samsung Galaxy F41: స్మార్ట్ ఫోన్ల‌ దిగ్గ‌జం సామ్‌సంగ్..  భార‌త మార్కెట్ లోకి వ‌రుస‌గా త‌న ఫోన్లను లాంచ్ చేస్తుంది. తాజాగా ఎఫ్ సిరీస్‌లో మ‌రో ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే సామ్‌సంగ్ ఎఫ్ 41.  ఈ ఫోన్ 64 మెగా ఫిక్స‌ల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్ర‌త్యేక ప్యూచ‌ర్ల‌తో ఆక‌ర్షించ‌నున్న‌ది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. 

 వాటి ప్రకారం.. ఈ ఫోన్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో రానున్న‌ది. ఇందులో సామ్‌సంగ్ ఈజీన్స్ 9611 ప్రాసెసర్ ను ఉప‌యోగించారు. గ్రాఫిక్స్ అవసరాల కోసం మేయిల్ - జీ72 ఎంపీ3 జీపీయూ లభిస్తుందని తెలుస్తోంది.

అలాగే.. 6జీపీ ర్యామ్ + 64 జీపీ , 6జీపీ ర్యామ్ + 128జీపీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన 2 మోడల్స్ లో అందుబాటులోకి రానున్నాయి. మెమరీ కార్డు ద్వారా 512 GB వరకూ అదనంగా స్టోరేజ్ పొందే అవకాశం ఈ ఫోన్ లో ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే వ‌న్ యూఐ యూజర్ ఇంటర్ ఫేస్ ఈ ఫోన్లో ఉంటుంది.

ఇక కెమెరా విష‌యానికి వ‌స్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, దాంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్, మాక్రో సెన్సార్‌లు ఉన్నాయి. అలాగే సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 32 మెగా ఫిక్స‌ల్ సెల్ఫీ కెమెరా అమ‌ర్చ‌బ‌డి ఉంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో, అద్భుతమైన సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అలాగే 4 జీ వీఓఎల్‌టీఈ రెండు సిమ్ కార్డుల సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 5 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది.

ఈ ఫోన్ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ బ్యాట‌రీ. ఇందులో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఫోన్ వేగంగా ఛార్జింగ్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇన్ని అదిరిపోయే ప్యూచ‌ర్లు ఉన్నా ఈ ఫోన్ త‌క్కువ బ‌డ్జెట్‌లోనే రానున్న‌ది. అది కూడా 15 వేల రూపాయల ధరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో గానీ, అక్టోబర్ మొదటి వారంలో గానీ భారతీయ మార్కెట్లో అందుబాటులో రానున్న‌ది.  

Tags:    

Similar News