Moto G9: మోటో జీ9.. బ‌డ్జెట్ ఫోన్

Moto G9:  మోటో జీ9.. బ‌డ్జెట్ ఫోన్
x

Moto G9 With 5,000mAh Battery, Snapdragon SoC Launched: Price, Specifications

Highlights

Moto G9: ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్‌ మోటోరోలా త‌న‌ కొత్త స్మార్ట్ ఫోన్ మోటో జీ9ను ఆవిష్కరించింది. 48 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదిరిపోయే స్పెసిఫికేషన్లు ఉన్న ఈ ఫోన్ ను

Moto G9: ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్‌ మోటోరోలా త‌న‌ కొత్త స్మార్ట్ ఫోన్ మోటో జీ9ను ఆవిష్కరించింది. 48 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదిరిపోయే స్పెసిఫికేషన్లు ఉన్న ఈ ఫోన్ ను అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో కేవ‌లం రూ. 11.499 ల‌కే భార‌త మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ ఫోన్ ను క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో అందుబాటులోకి రానున్న‌ది.

48 మెగా పిక్సెల్ కెమెరా ఈ ఫోన్‌ యొక్క ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ . ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా 48 మెగా పిక్సెల్ కాగా, ఇందులో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీని అందించడం విశేషం. దీంతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సెల్ఫీ లవ‌ర్స్‌ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే.. ఆటో స్మైల్ క్యాప్చర్, హెచ్ డీఆర్, ఫేస్ బ్యూటీ, మాన్యువల్ మోడ్, రా ఫొటో అవుట్ పుట్ వంటి ఫీచర్లతో అద‌ర‌కొడుతుంది.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌కు మ‌రో ఆకర్ష‌ణ‌గా నిలువ‌నున్న‌ది. ఈ ఫోన్ 20W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ+ మ్యాక్స్ విజన్ టీఎఫ్ టీ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ టు బాడీ రేషియో 87 శాతంగా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు. 4 జీబీ ర్యామ్ . స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

అలాగే 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.11,499గా నిర్ణయించారు. ఫారెస్ట్ గ్రీన్, సఫైర్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories