Viral Video: ప్రాణం పణంగా పెట్టి మరీ.. ఇంత రిస్క్‌ అవసరమా.? షాకింగ్‌ వీడియో..!

Viral Video: అవసరం మనిషిని ఏదైనా చేయిస్తుందని చెబుతుంటారు. అయితే ఆ అవసరమే ప్రాణాల మీదికి తీసుకొస్తే, ప్రాణాన్ని పణంగా పెట్టేలా చేస్తే.

Update: 2025-02-14 10:11 GMT

Viral Video: ప్రాణం పణంగా పెట్టి మరీ.. ఇంత రిస్క్‌ అవసరమా.? షాకింగ్‌ వీడియో..!

Viral Video: అవసరం మనిషిని ఏదైనా చేయిస్తుందని చెబుతుంటారు. అయితే ఆ అవసరమే ప్రాణాల మీదికి తీసుకొస్తే, ప్రాణాన్ని పణంగా పెట్టేలా చేస్తే. అస్సలు బాగోదు కదూ! ఎంత అవసరమైనా మనిషి ప్రాణం కంటే ఎక్కువైతే కాదు. అందుకే ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదని చెబుతుంటారు. కొందరు మాత్రం అవసరం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇది నిజం అనిపించకమానదు. ఇంతకీ ఏంటా వీడియో.? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

గమ్యస్థానం చేరుకోవడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కొందరు సొంత వాహనాలపై వెళితే మరికొందరు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌పై ఆధారపడుతారు. అయితే మరికొందరు మాత్రం ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తుంటారు. ఓ ఇద్దరు ఇలాగే తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రయాణం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇద్దరు యువకులు లారీ వెనుక వైపు వేలాడుతూ వెళ్లడం చూసి అంతా షాక్ అవుతున్నారు.

రద్దీగా ఉన్న ఓ హైవైపే పెద్ద ట్యాంకర్‌ లారీ వెళ్తోంది. అదే సమయంలో ట్యాంకర్ వెనుక వైపు ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. ఓ వ్యక్తి వెనుక వైపు ఉన్నఇనుప కడ్డీపై నిలబడగా.. మరో వ్యక్తి అక్కడే తాపీగా కూర్చున్నాడు. లారీ యమ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇదంతా వెనకాల వస్తున్న కారులో వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌ మారింది.

వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు పోవడం ఖాయం. ఇంతటి సాహసం చేయడం అవసరమా.? కాస్త ఆలస్యంగా వెళ్తే ఏమవుతుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ అసలు వారిని అలా ఎక్కడానికి అనుమతించిన ఆ లారీ డ్రైవర్‌ను శిక్షించాలి అప్పుడే ఇంకోసారి ఇలాంటి పని చేయడు అంటూ స్పందించారు. మొత్తం మీద ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.


Tags:    

Similar News