Viral Video: గుడ్డులో నుంచి బయటకు వస్తున్న పాము.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే
Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పాముల జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి ప్రత్యేకమైన శరీర ఆకృతి, రంగులు, ప్రవర్తన ఉంటుంది. పాముల ఆహార పద్ధతులు కూడా వేరుగా కనిపిస్తాయి.
Viral Video: గుడ్డులో నుంచి బయటకు వస్తున్న పాము.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే
Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పాముల జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి ప్రత్యేకమైన శరీర ఆకృతి, రంగులు, ప్రవర్తన ఉంటుంది. పాముల ఆహార పద్ధతులు కూడా వేరుగా కనిపిస్తాయి. అంతేకాకుండా, వీటి పునరుత్పత్తి విధానాల్లో కూడా భిన్నత్వం ఉంటుంది.
కొన్ని పాములు నేరుగా పిల్లలకు జన్మనిస్తే, మరికొన్ని గుడ్ల ద్వారా పిల్లలను కంటాయి. గుడ్ల ద్వారా పిల్లలు పుట్టే పాములను "ఓవిపారస్ స్నేక్స్" అంటారు. ఇవి గుడ్లు పెట్టిన తర్వాత వాటిని రక్షించుకునేలా సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచుతాయి. ప్రధానంగా రాళ్ల చీలికలు, చెట్ల పొదలు లేదా పాడైన చెట్లలో తమ గుడ్లను ఉంచేందుకు ప్రయత్నిస్తాయి.
అయితే గుడ్డు నుంచి పాము బయటకు వచ్చే విధానం ఎంతో విచిత్రంగానూ, భయంకరంగానూ ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి, పెద్ద గుడ్డు పైభాగాన్ని తెరిచి, అందులోంచి ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన పామును బయటకు తీశాడు. ఆ పాము మొట్టమొదటిగా వెలుగులోకి వస్తుండటంతో ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ అద్భుత దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ వీడియోను చూసి షాక్‌కి గురైతే, మరికొందరు మాత్రం ఇలాంటి వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.