Viral: వాగులో కొట్టుకుపోయిన కారు…
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. కొన్నిరోజులుగా ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో రాజస్థాన్‌లోని ఝాలావాడ్ జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి.
Viral: వాగులో కొట్టుకుపోయిన కారు…
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. కొన్నిరోజులుగా ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో రాజస్థాన్‌లోని ఝాలావాడ్ జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో సారోలా ప్రాంతంలోని బోరకేడీ వద్ద వాగు దాటుతున్న ఓ కారు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయితే వెంటనే స్పందించిన స్థానికులు అందులో ఉన్న ముగ్గురిని సురక్షితంగా రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. బాధితులను టీచర్ విద్యారాణి, ఆంగన్‌వాడీ కార్యకర్త భావనా మీణా, డ్రైవర్ ఆశిష్ మీణాగా గుర్తించారు. వీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉంటే ఢిల్లీలోనూ ఎడతెరపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ముంబైలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం నగరాన్ని స్తంభింపజేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రవాణా వ్యవస్థ దెబ్బతింది. అంధేరీ సబ్‌వే సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అధికారులు సబ్‌వేను మూసివేశారు. భారీ వర్షాలు విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.