Viral Video: పాములు చెట్లు ఎలా ఎక్కుతాయో ఎప్పుడైనా చూశారా.? వైరల్‌ వీడియో

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త కొత్త వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

Update: 2025-03-26 08:30 GMT

Viral Video: పాములు చెట్లు ఎలా ఎక్కుతాయో ఎప్పుడైనా చూశారా.? వైరల్‌ వీడియో

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త కొత్త వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నింటిలో కామెడీ ఉంటే, మరికొన్నింటిలో థ్రిల్, మరోవైపు కొన్ని మాత్రం భయాన్ని కలిగించేలా ఉంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలకు సోషల్‌ మీడియాలో ఉండే క్రేజే వేరు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

పాములు చెట్లు ఎక్కడం గురించి విని ఉంటాం. కానీ చూడడం మాత్రం చాలా అరుదని చెప్పాలి. అయితే పాములు చెట్లను అవలీలగా ఎక్కేస్తాయనే విషయం మీకు తెలుసా.? తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో కొండచిలువ చెట్టెక్కేందుకు అనుసరించిన టెక్నిక్ అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంది. తాటి చెట్టు, కొబ్బరి చెట్లు ఎక్కే సమయంలో మనుషులు ఎలాంటి ట్రిక్‌ను ఉపయోగిస్తారో ఈ పాము కూడా అలాగే చెట్టు ఎక్కేసింది.

మొదట తన శరీరాన్ని చెట్టుకు చుట్టుకుని, ఆపై మెరుపు వేగంతో పైకి పాకుతూ పైకి ఎక్కింది. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పాములు ఇంత వేగంగా చెట్లు ఎక్కడం నిజంగానే అద్భుతం అంటున్నారు. మరికొందరు స్పందిస్తూ.. ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవి అద్భుతమే అంటూ స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. 


Tags:    

Similar News