Viral Video: గ‌ర్భిణీ చేసిన ప‌నికి ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు.. అస‌లేం జ‌రిగిందంటే

Viral Video: బ్రిటన్‌లో నివసిస్తున్న డాక్టర్ సోనం దహియా అనే గర్భవతైన మహిళ ఒక బాలీవుడ్ పాటపై డాన్స్ చేస్తూ వీడియో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది.

Update: 2025-05-19 09:30 GMT

Viral Video: గ‌ర్భిణీ చేసిన ప‌నికి ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు.. అస‌లేం జ‌రిగిందంటే

Viral Video: బ్రిటన్‌లో నివసిస్తున్న డాక్టర్ సోనం దహియా అనే గర్భవతైన మహిళ ఒక బాలీవుడ్ పాటపై డాన్స్ చేస్తూ వీడియో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ప్రస్తుతం ఆమె గ‌ర్భంలో క‌వ‌ల‌లు ఉన్నారు. అయినప్పటికీ ఆమె చేసిన డ్యాన్స్‌లో ఉత్సాహం, ఎనర్జీ చూసి కొంతమంది ప్రేరణ పొందారు. మరి కొంతమంది మాత్రం ఇది భద్రమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

డాక్టర్ సోనం దహియా, యూకేలో జనరల్ ప్రాక్టిషనర్‌గా పని చేస్తున్నారు. మే 3న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో కోరియోగ్రాఫర్ ఆదిల్ ఖాన్‌తో కలిసి "డింగ్ డాంగ్ డోల్" పాటపై నృత్యం చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 50 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి.



కొంతమంది గర్భవతులైన మహిళలు ఈ వీడియో చూసి ప్రేరణ పొందినట్లు కామెంట్లు చేశారు. గర్భధారణ సమయంలో శారీరక చురుకుదనం అవసరమే అని, ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరోవైపు కొంతమంది నెటిజన్లు ఇలాంటి డ్యాన్స్ గర్భంలో ఉన్న బిడ్డలకు సురక్షితమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ కామెంట్లకు స్పందించిన డాక్టర్ సోనం మరో వీడియోలో స్పష్టత ఇచ్చారు.



“నేను ఒక డాక్టర్‌గా, గర్భధారణ సమయంలో వ్యాయామం గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉన్నా, మీ గర్భం క్లిష్టంగా లేకపోతే, సాధారణ శారీరక కార్యకలాపాలు ప్రమాదకరం కావు. ఇవి గర్భస్రావం, తక్కువ బరువుతో పుట్టడం లేదా ప్రీమెచ్యూర్ డెలివరీకి కారణం కావు,” అని చెప్పారు. అయితే ఏ వ్యాయామాన్ని చేయాలో మీ డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం అని సూచించారు.

వీడియోపై వస్తున్న విమర్శలపైనా స్పందిస్తూ, “ఒక సంస్కృతిలో అసహ్యంగా అనిపించేది మరో సంస్కృతిలో సాధారణమే కావచ్చు. మనం ఈ భిన్నతలను గౌరవించడం, అర్థం చేసుకోవడం అవసరం,” అన్నారు. తన దుస్తులు, ఉద్దేశ్యాలపై వస్తున్న విమర్శలకు ఆమె స్పందిస్తూ, “ఎక్సర్సైజ్ ఒక వ్యక్తిగత ప్రయాణం. దాన్ని నేను ఏ దుస్తుల్లో చేస్తాను అనేది నా స్వంత ఎంపిక. అది నన్ను స్వేచ్ఛగా, నమ్మకంగా భావించేలా చేస్తుంది,” అన్నారు.

“ఒకరి రూపం లేదా ఒక వీడియో చూసి వారి బిడ్డల భవిష్యత్తును నిర్ణయించడం బాధాకరం. మన హృదయం, మన నైతిక విలువలే ముఖ్యమైనవి. మనం ఇతరుల పట్ల దయగా ఉండడమే అసలైన విలువలు.” అని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఇప్పుడీ అంశం నెట్టింట చ‌ర్చ‌కు తెర తీసింది.

Tags:    

Similar News