PM Kisan: పీఎం కిసాన్‌ నిధులు విడుదలకు రంగం సిద్ధం.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకున్నారా?

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6,000 మూడు విడతలుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది.

Update: 2025-06-20 11:22 GMT

ఇప్పటివరకు 19 విడతల నిధులు విడుదల చేయగా, 2025 ఫిబ్రవరి 24న 19వ విడత నిధులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. అప్పుడు దాదాపు 9.8 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. ఇప్పుడు 20వ విడత నిధుల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఒక‌టి రెండు రోజుల్లో నిధులు జ‌మ‌ అయ్యే అవకాశముంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

బెనిఫిట్ పొందాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి

ఈ పథకంలో లబ్ధి పొందాలంటే రైతులు e-KYC (ఇలక్ట్రానిక్ నో యోర్ కస్టమర్) ప్రక్రియ పూర్తిచేయాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలను కచ్చితంగా లింక్ చేయాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా 20,000 మందికిపైగా అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చింది.

ల‌బ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా? ఇలా తెలుసుకోండి:

* ఇందుకోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://pmkisan.gov.in

* హోమ్ పేజీలో "ఫార్మర్స్ కార్నర్" (Farmers Corner) సెక్షన్‌లోకి వెళ్ళండి

* Beneficiary List ని సెల‌క్ట్ చేసుకోవాలి.

* మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలు ఎంటర్ చేయండి

పూర్తి స‌మాచారం, స‌హాయం కోసం ఈ కింది నెంబ‌ర్ల‌కు కాల్ చేయండి.

* పీఎం కిసాన్ హెల్ప్‌లైన్: 155261

* కస్టమర్ సపోర్ట్: 011-24300606

Tags:    

Similar News