Photo Puzzle: చూడ్డానికి నార్మల్‌గానే ఉన్నా.. ఈ ఫొటోలో పాము ఉంది. కనిపెట్టగలరా.?
Photo Puzzle to Find The Hidden Snake: పైన కనిస్తున్న ఫొటో చూడగానే బండరాళ్లు, చెత్తాచెదారం కనిపిస్తోంది కదూ! అయితే ఈ ఫొటోలో ఓ పాము దాగి ఉంది అంటే మీరు నమ్మగలరా.? అవును నిజంగానే ఈ ఫొటోలో ఓ పాము ఉంది. దాన్ని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్ ఉద్దేశం.
Photo Puzzle: చూడ్డానికి నార్మల్‌గానే ఉన్నా.. ఈ ఫొటోలో పాము ఉంది. కనిపెట్టగలరా.?
Photo Puzzle to Find The Hidden Snake: కొన్ని దృశ్యాలు చూసే కళ్లను మాయ చేస్తుంటాయి. బుర్రను పాడు చేస్తుంటాయి. ఎంత ప్రయత్నించినా వాటిలో ఉన్న మ్యాజిక్‌ను గుర్తించడం అంత సులువు కాదు. సాధారణంగా ఎడిటింగ్ చేసిన ఫొటోల్లో, గ్రాఫిక్స్‌లో డిజైన్ చేసిన ఫొటో పజిల్స్ గురించి మనకు తెలిసి ఉంటుంది. అయితే కొన్ని సహజంగా తీసిన ఫొటోలు కూడా చూసే కళ్లను మాయ చేస్తుంటాయి.
స్మార్ట్ ఫోన్స్‌లో నేచురల్‌గా తీసిన ఫొటోల్లో కూడా మ్యాజిక్ దాగి ఉంటుంది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏమాత్రం భిన్నంగా కనిపించినా సరే వెంటనే ఫొటోలను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పైన కనిస్తున్న ఫొటో చూడగానే బండరాళ్లు, చెత్తాచెదారం కనిపిస్తోంది కదూ! అయితే ఈ ఫొటోలో ఓ పాము దాగి ఉంది అంటే మీరు నమ్మగలరా.? అవును నిజంగానే ఈ ఫొటోలో ఓ పాము ఉంది. దాన్ని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్ ఉద్దేశం. మరి మీకు ఆ పాము కనిపించింది. నక్కి నక్కి బయటకు రావాలా.. వద్దా అన్నట్లు చూస్తోంది. ఇంతకీ పామును కనిపెట్టారా.?
అయితే ఆ పామును గుర్తించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఆ పామును అచ్చంగా ఫొటోలో ఉన్న బండల రంగును పోలి ఉంది. దీంతో పామును అంత ఈజీగా కనిపెట్టడం కుదరదు. అయితే ఓసారి ఫొటో మధ్యలో గమనించండి బండ సందులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది చూశారా.? ఎంత ప్రయత్నించినా పాము కనిపించకపోతే ఓసారి కింది ఫొటోపైఓ లుక్కేయండి.