Optical Illusion: ఈ ఫోటో చూడగానే మీకు ఏం కనిపించింది.? దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..

Optical Illusion: సైకాలజీ అనేది ఒక అపారమైన సముద్రంలా ఉంటుంది. మన మాటలకన్నా, చూపు, ముఖ హావభావాలు, శరీర భాష ఆధారంగా మన భావజాలాన్ని, మనసులోని ఆలోచనలను తెలుసుకోవచ్చు.

Update: 2025-08-07 05:45 GMT

Optical Illusion: ఈ ఫోటో చూడగానే మీకు ఏం కనిపించింది.? దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..

Optical Illusion: సైకాలజీ అనేది ఒక అపారమైన సముద్రంలా ఉంటుంది. మన మాటలకన్నా, చూపు, ముఖ హావభావాలు, శరీర భాష ఆధారంగా మన భావజాలాన్ని, మనసులోని ఆలోచనలను తెలుసుకోవచ్చు. ఈ శాస్త్రం ద్వారా మన వ్యక్తిత్వాన్ని విశ్లేషించడానికి సైక్రియాట్రిస్టులు పలు పద్ధతులను ఉపయోగిస్తారు. వాటిలో ఓ ఆసక్తికరమైనది — ఆప్టికల్ ఇల్యూషన్ పర్సనాలిటీ టెస్ట్.

ఈ పరీక్షలో ఒక ఫోటోను చూపించి, "మీకీ చిత్రంలో ముందుగా ఏమి కనిపిస్తోంది?" అని ప్రశ్నిస్తారు. మీరు ఏ అంశాన్ని ముందుగా గమనించారో దాని ఆధారంగా మీ మనస్తత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది.

ఇక్కడ చూపిన ఫోటో కూడా అలాంటి పరీక్షకు సంబంధించినదే. దాన్ని చూసిన వెంటనే మీ కళ్లకు ముందు ఏ దృశ్యం కనిపించింది? దానిపైనే మీ వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు చెబుతాయి.

1. పుర్రె కనిపించిందా?

ఫోటోను చూసిన వెంటనే మీకు పుర్రె (skull) కనిపిస్తే, మీరు మేధావి. ఇది ఏ మాత్రం నెగటివ్‌గా భావించాల్సిన విషయం కాదు. మీ ఆలోచనలు లోతుగా ఉంటాయి. విషయాలను గమనించే, విశ్లేషించే తత్వం మీలో ఉంది. మీరు శాంతంగా ఉంటూ, సమస్యలను బలమైన లోతైన దృష్టితో చూసే మనస్తత్వం కలవారు. సమస్యలపై స్పందించే ముందు విస్తృతంగా ఆలోచిస్తారు.

2. బాలిక కనిపించిందా?

చిన్నారి మొదట కనిపిస్తే, మీ మనసు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. గతంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులనూ మీరు తేలికగా అధిగమించే శక్తిని కలిగి ఉన్నారు. జీవితాన్ని ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు. ఒత్తిడిని తేలికగా హ్యాండిల్ చేయగల సమర్థత మీ సొంతం. చురుకైన ఆలోచనలు, కష్టాల్లోనూ ఆశను కోల్పోని ధోరణి మీ వ్యక్తిత్వానికి ప్రాణం.

3. ప్రకృతి దృశ్యం కనిపించిందా?

మీకు మొదట నచ్చినది వెనుక భాగంలో ఉన్న ప్రకృతి దృశ్యమైతే, మీరు సున్నితమైన, శ్రద్ధగల, స్వయంపై నమ్మకం ఉన్న వ్యక్తి. ఇతరులు ఆందోళనతో ఉన్నపుడూ, మీరు మాత్రం చైతన్యంతో, స్పష్టతతో ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు. మీరు తీసుకునే నిర్ణయాలపై గట్టి నమ్మకం ఉంటుంది. సమస్యల సమయంలో మీ గట్ ఫీలింగ్‌ను అనుసరించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతారు.

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ సరదాగా కనిపించినా, మన అంతర్గత మనస్తత్వాన్ని విశ్లేషించడంలో చిన్న చిన్న సూచనలు ఇస్తుంది. మీరు ఏ దృశ్యాన్ని చూసారో అది మీలో దాగిన స్వభావ లక్షణాలకు సూచికగా నిలుస్తుంది.

Tags:    

Similar News