Personality Test Photos: మనం ఎలాంటి వాళ్లమన్న విషయం మనకంటే మనల్ని చూసే వారికే ఎక్కువగా తెలుస్తుందని అంటుంటారు. నిజానికి మనలోని మనకు తెలియని ఎన్నో విషయాలు మనల్ని గమనించే వారికి తెలుస్తాయి. మన ఆలోచనలు, మనం రియాక్ట్ అయ్యే విధానం అన్ని పక్కవారే ఎక్కువగా గమనిస్తుంటారు. అయితే ఒక మనిషి వ్యక్తిత్వం ఎలాంటి అతను ఈ ప్రపంచాన్ని చూసే విధానం ఆధారంగా అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు.
ఒక వస్తువును మనం ఎలా చూస్తున్నామన్నదాని బట్టి మన ఆలోచనలు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెబుతుంటారు. దీనినే సైన్స్ పరిభాషలో 'పర్సనాలిటీ టెస్ట్'గా అభివర్ణిస్తుంటారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి పర్సనాలిటీ టెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ ఫొటోనే ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. పైన ఓ ఫొటో కనిపిస్తోంది గమనించారా? ఆ ఫోటోను ముందుగా ఒకసారి తీక్షణంగా పరిశీలించండి. ఆ తరువాతే మళ్లీ ఆ కింది పేరాగ్రాఫ్ చదవండి.
ఈ ఫోటోలో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి నోరు తెరిచి కేకలు వేస్తున్నట్లున్నట్లుగా కనిపిస్తున్న వ్యక్తి. మరొకటి చేయి పైకి ఎత్తినట్లున్న ఆకారం. ఈ రెండింటిలో మొదట మీకు ఏది కనిపిస్తుందో దానిని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చు అంటున్నారు సైకాలజిస్టులు.
* మొదట ఫొటో చూడగానే ఒకవేళ మీకు అరుస్తున్నట్లు కనిపిస్తున్న మనిషి ముఖం కనిపిస్తే.. మీరు అందరిలా ఆలోచించరని అర్థం. మీ ఆలోచన శైలి ఇతరులతో పోల్చితే విభిన్నంగా ఉంటుంది. మీకు ఆత్మపరిశీలన ఎక్కువగా ఉంటుంది. ప్రతీ అంశం గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకునేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు అని నిపుణులు సూచిస్తున్నారు.
* ఒకవేళ ఫొటో చూడగానే మొదట తెల్లటి ఆకారంలో ఉన్న చేయి కపిపిస్తే. మీకు ఎంతటి కష్టాన్ని అయినా సాల్వ్ చేసే నైపుణ్యం ఉంటుందని అర్థం. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సమస్యలను త్వరగా అర్థం చేసుకుని పరిష్కరిస్తారు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు అని సైకాలజిస్టులు చెబుతున్నారు.