ఏపీలో మరో ఎన్నికల పండగ..

Update: 2019-05-11 01:20 GMT

ఏపీలో మరో ఎన్నికల సందడి కనిపించనుందా..? త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసి చాలాకాలం అయింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ జరుగుతోంది. దీంతో పాలనా వ్యవస్థ కుంటుబడింది. ఈ క్రమంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆగస్టును ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణ ఎన్నికల ఫలితాలు ఈనెల 23న వెలువడనున్నాయి. ఈ నెల చివర లేదా జూన్ మొదటి వారంలో నూతన ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది.

దీంతో పాలన వ్యవస్థ గాడిన పడటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో అయితే పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి అన్నివిధాలా అనుకూలం అని అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా సర్పంచుల పదవులకు, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంది. రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగా పంచాయతీలుగా మార్చిన 142 తండాలు కలిపి మొత్తం 13,060 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్‌ అధికారులు చర్చించినట్టు సమాచారం. 

Similar News