Viral Video: ఇలా కూడా ఆమ్లెట్ వేయొచ్చా? కడుపులో తిప్పేస్తున్న పాక్ ఆమ్లెట్ వీడియో..సోషల్ మీడియాలో వైరల్
Viral Video: ఒకే వంటకం ఒక్కోప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. తెలుగు వంటలు ఒకలా ఉంటే కేరళ వంటలు ఇంకొకలా ఉంటాయి. ఏదైనా తినడానికి ఇబ్బంది అనిపించినా తినేయగలుగుతాం.
Viral Video: ఇలా కూడా ఆమ్లెట్ వేయొచ్చా? కడుపులో తిప్పేస్తున్న పాక్ ఆమ్లెట్ వీడియో..సోషల్ మీడియాలో వైరల్
Viral Video: ఒకే వంటకం ఒక్కోప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. తెలుగు వంటలు ఒకలా ఉంటే కేరళ వంటలు ఇంకొకలా ఉంటాయి. ఏదైనా తినడానికి ఇబ్బంది అనిపించినా తినేయగలుగుతాం. కానీ ఈ ఆమ్లెట్‌ని చూస్తే మనిషి అన్నవాడు ఎవరూ తినరు. అయినా పాకిస్తాన్ ఈ ఆమ్లెట్ తినడానికి జనం ఎగబడిపోతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ ఆమ్లెట్ ఏంటో ఇప్పడు చూద్దాం.
రోడ్డుపక్క ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక వ్యక్తి అటు ఇటు తిప్పుడూ ఆమ్లెట్ వేస్తుంటాడు. చూడడానికి ఆ ఆమ్లెట్ నల్లగా ఉంటుంది. అయినా అందరూ ఆ ఆమ్లెట్‌ను తెగ తింటుంటారు. ఇతడు వేస్తూ వెళుతుంటాడు. అయితే ఇంతకీ అతగాడు ఆమ్లెట్ వేస్తున్న విధానం చూస్తున్నా, అందులో వాడిన పదర్ధాలు చూసినా.. కడుపులో తిప్పేస్తుంది. ఆమ్లెట్ ఇలా కూడా వేస్తారా? అన్నట్టు ఉంది ఆ వీడియో.
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియోలో పాకిస్తాన్ కు చెందిన ఓ యువకుడు ఆమ్లెట్ వేస్తూ కనిపిస్తాడు. సాధారణంగా ఎవరైనా ఆమ్లెట్ వేయాలంటే గుడ్డును పగులకొట్టి , అందులో కాసిన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు,కారం, పసుపు ఇలా అన్నీ వేసి కలుపుతాం. ఆ తర్వాత పెనంపై నూనె వేసి ఆమ్లెట్ వేస్తాం కదా. కానీ ఇక్కడ ఈ వ్యక్తి డైరెక్ట్‌గా ఆమ్లెట్‌ని ఒక పెద్ద పెనంపై వేస్తాడు. అప్పుడు ఆ తర్వాత పెనంపైన పక్కనే ఉన్న ఆయిల్‌లో గుడ్డు సొనను వేసి కలుపుతాడు. ఇంతకీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఆయిల్ చాలా నల్లగా ఉంటుంది. దీంతో ఆ ఆమ్లెట్ కూడా నల్లగా తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని బాగా నలిపి, పక్కనే ఉన్న మిశ్రమంలో కలుపుతాడు. చివరగా మళ్లీ ఆ మిశ్రమాన్ని తీసుకుని ఆయిల్‌లో వేడి చేస్తాడు. ఇలా విచిత్రమైన పద్దతిలో ఆమ్లెట్‌ని సిద్దం చేసి అందరి గిన్నెల్లో వేసేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ఆమ్లెట్ వేయడానికి వాడిన ఆయిల్ ఇంజన్ ఆయిల్ అని కొందమంది కామెంట్లు పెట్టారు. ఇంతకీ అతను ఏం ఆయిల్ వాడాడో మనకు తెలియదు కానీ.. చూస్తుంటేనే తినబుద్దికావడం లేదు. అక్కడ వాల్లు ఎలా తింటున్నారో తెలియదు.