Millionaire: పాత పేపర్లలో కనిపిస్తే చిత్తుబుక్కు అనుకున్నాడు.. తెరిచి చూసి రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు
Overnight millionaire in Chile: ఒక్కోసారి రాత్రికి రాత్రి ధనవంతుడు అయ్యాడు అనే వార్తలు మనం వినే ఉంటాం. అదే నిజ జీవితంలో కూడా జరిగింది.
Millionaire: పాత పేపర్లలో కనిపిస్తే చిత్తుబుక్కు అనుకున్నాడు.. తెరిచి చూసి రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు
Overnight Millionaire
Overnight millionaire in Chile: పాత చిత్తు కాగితాలలో పాసు పుస్తకం చూసి అదేదో చిత్తు పుస్తకం అనుకున్నాడు. కానీ రాత్రికి రాత్రి అతనిని ఒక బిలియన్ గా మార్చేసింది. చాలామంది అతి తక్కువ సమయంలోనే కోట్లు సంపాదిస్తారు. అది కలానా ? నిజమా? అనుకుంటారు. అది జీవితంలో జరగదులే అని అనుకుంటారు. కానీ మచ్చుకు కొన్ని ఇలాంటి సంఘటనలు జరగటం వల్ల అది నిజమే అవుతుంది. అలాంటి ఘటనే చిలీలో జరిగింది.
పాత చిత్తు పేపర్లలో ఉన్న పుస్తకం చూసి అదేదో చిత్తు బుక్కులే అని ప్రతిసారీ అనుకున్నాడు. కానీ తెరిచి చూస్తే అది పాస్ బుక్ అదొక బ్యాంకు చెందిన పాస్ బుక్. గతంలో కూడా ఎన్నోసార్లు చూశాడు. కానీ అది ఏదో చిత్తుబుక్కు అని అనుకున్నాడు. దాంతో ఏ లాభం ఉంటుందిలే అనుకున్నాడు.
అలాగే వదిలేశాడు అయితే చివరిగా అదే తన జీవితాన్నే మార్చేసింది. చిలీలో ఉంటున్న ఈ వ్యక్తి పేరు ఎగ్జేక్వియల్ హినోజోస పదేళ్ల క్రింద అతని నాన్న చనిపోయాడు. ఆయన ఆశీర్వాదాలు మేరకు నేడు అతను ఒక మిలినియర్ అయిపోయాడు. రూ.1. 4 లక్షలు 1960- 70 మధ్యలో డిపాజిట్ చేశారు. ఇల్లు కట్టుకుందామని ఆయన ఆ డబ్బును పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశారు. కానీ కాలక్రమేణా ఆయన చనిపోయాడు. అయితే అతను ఈ డబ్బు డిపాజిట్ చేసిన సంగతి కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదు.
అంటే 62 ఏళ్ల తర్వాత ఆ పాస్ బుక్ ఇప్పుడు హినోజోస కంట్లో పడింది. ఇది బ్యాంకుకు సంబంధించిన పాస్ బుక్ అయితే మొదట్లో హినోజోసా ఈ పాస్ బుక్ తో అతనికి ఏం వస్తుందిలే అని అనుకున్నాడు. కానీ సడెన్‌గా హినోజోసా కళ్లు ఆ పాస్ బుక్ పైన 'స్టేట్ గ్యారంటీ' అనే రెండు పదాలను చూశాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది. దీనర్థం ఒకవేళ పొరపాటున బ్యాంకు అతనికి డబ్బు తిరిగి చెల్లించకపోతే.. గవర్నమెంట్ ఆ డబ్బులు చెల్లిస్తుంది అని అర్థం.
దీంతో వెంటనే అతడు గవర్నమెంట్ కు ఆ డబ్బుల కోసం ఆర్జీ పెట్టుకున్నాడు. కానీ మొదట్లో ప్రభుత్వం కూడా అతనికి చెల్లించడానికి నిరాకరించింది. కానీ లీగల్ గా హెనోజోస పోరాడాడు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం అతనికి అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది. అంటే మొత్తంగా రూ. 10, 27, 79,580 ఇచ్చింది ప్రభుత్వం. దీంతో రాత్రికి రాత్రే హినోజోసా కోటీశ్వరుడు అయిపోయాడు.