Viral Video: అయ్యో పాపం.. తిమింగళం ఆ యువతిని ఏం చేసిందో చూడండి.. అరుదైన వీడియో..
Viral Video: సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ సస్పెన్స్‌తో, థ్రిల్లింగ్‌తో నిండిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
Viral Video: అయ్యో పాపం.. తిమింగళం ఆ యువతిని ఏం చేసిందో చూడండి.. అరుదైన వీడియో..
Viral Video: సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ సస్పెన్స్‌తో, థ్రిల్లింగ్‌తో నిండిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇందులో ఓ మహిళను భారీ ఆర్కా తిమింగలం (Orca Whale) మింగబోతున్నట్లు కనిపించడం సోషల్ మీడియా వినియోగదారుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వీడియోను జెస్సికా ట్రెండ్ అనే యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేయగా, క్షణాల్లోనే ఇది వైరల్ అయింది.
వీడియోలో ఏముందంటే?
ఈ వైరల్ వీడియో రెండు భాగాలుగా ఉంది.
మొదటి భాగంలో ఒక మహిళ తిమింగలం పై నిలబడి సాహసోపేతంగా ప్రదర్శన చేస్తూ కనిపిస్తుంది. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఆమె ధైర్యాన్ని అభినందిస్తారు. ఇది అక్వేరియంలో జరిగే ప్రదర్శనలాంటిదిగా అనిపిస్తుంది.
రెండవ భాగంలో అదే మహిళ వెట్‌సూట్ వేసుకుని భయంతో తిమింగలం ముందు కనిపిస్తుంది. తిమింగలం ఆమెపైకి దూసుకువచ్చి, నోట్లోకి లాక్కుంటున్నట్టుగా సన్నివేశం ఉండటంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో "నన్ను రక్షించండి… నేను చాలా భయపడ్డాను" అంటూ ఆమె కేకలు వినిపించడం మరింత టెన్షన్ కలిగించింది.
నిజమేనా కాదా?
ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఇది నిజం కాదని చెబుతున్నారు. కొంతమంది ఇది AI టెక్నాలజీతో తయారు చేసిన ఎడిటెడ్ వీడియో అని అంటున్నారు. అయితే, నిజమేనా నకిలీనా అన్నది పక్కన పెడితే, ఈ వీడియో చూసిన వారందరికీ థ్రిల్, భయం కలగడం మాత్రం నిజమే. ప్రస్తుతం ఈ వీడియోను @ఎంజానీమొబైల్ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా షేర్ చేశారు. ఇప్పటివరకు దీన్ని 98,000 మందికి పైగా లైక్ చేశారు.