Optical Illusion: ఈ ఫొటోలో తప్పును కనిపెట్టగలరా.? ఇంటలిజెంట్స్‌కే ఇది సాధ్యం..!
Optical Illusion: బ్రెయిన్ టీజర్లు, ఆప్టికల్ ఇల్యూషన్లు మన ఆలోచనా విధానాన్ని పదును పెట్టే మంచి సాధనాలు.
Optical Illusion: ఈ ఫొటోలో తప్పును కనిపెట్టగలరా.? ఇంటెలిజెంట్ ఉన్న వారికే ఇది సాధ్యం..!
Optical Illusion: బ్రెయిన్ టీజర్లు, ఆప్టికల్ ఇల్యూషన్లు మన ఆలోచనా విధానాన్ని పదును పెట్టే మంచి సాధనాలు. ఇటువంటి పజిల్స్ మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి అవసరమైన విశ్లేషణా శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇవి ఆసక్తిగా ఆడతారు. పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో ఉండే కిక్కే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్స్ ఒకటి. ఇవి మెదడుకు మంచి వ్యాయామంలా పనిచేస్తాయి. పజిల్స్ మనం చూసే దృష్టికోణం, పద్ధతి మనలోని ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా క్లిష్టమైన పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన పరిశీలనను, సహజ జ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉపయోగపడతాయి. అలాంటి ఒక మంచి పజిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా పజిల్.? అందులో ఉన్న ట్విస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెయిన్ టీజర్ పజిల్‌లో ఓ యువతి గిన్నెలు తోముతున్నట్లు కనిపిస్తుంది. సింక్, గిన్నెలు, ట్యాప్ అన్నీ కనిపిస్తున్నా… ఈ ఫొటోలో ఒక తప్పు ఉంది. దానిని కనిపెట్టడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఈ పజిల్‌ను మీరు సాల్వ్ చేశారా.? లేదా.? అయితే ఓసారి ఫొటోలో ఉన్న వస్తువులను జాగ్రత్తగా గమనించండి. ట్యాప్ పక్కన ఓ ఎలక్ట్రిక్ బల్బు కనిపిస్తుంది. ట్యాప్‌ను ఓపెన్ చేయడానికి కావాల్సిన నాబ్ స్థానంలో ఈ బల్బు ఉంది. ఈ ఫొటోలో ఉన్న తప్పు ఇదే.