Viral Video: ఏంట్రా.. ఇలా మోపయ్యారు.. రన్నింగ్ ట్రైన్ ముందు పడుకుని మరీ రీల్స్ ..!
Viral Video: ఈ మధ్యకాలంలో యువత ప్రవర్తన చూడగా, అది తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది.
Viral Video: ఏంట్రా.. ఇలా మోపయ్యారు.. రన్నింగ్ ట్రైన్ ముందు పడుకుని మరీ రీల్స్ ..!
Viral Video: ఈ మధ్యకాలంలో యువత ప్రవర్తన చూడగా, అది తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఓవర్‌నైట్‌లో ఫేమస్ కావాలనే అభిలాషతో డేంజరస్ స్టంట్లు చేసి రీల్స్, వీడియోలు తీయడం యువతలో మామూలైపోయింది. ఏమీ ఆలోచించకుండా ప్రాణాలతో ఆటలాడుతున్నారు.
తాజాగా, కొంతమంది యువత జలపాతాలు, సముద్రతీరాలు, క్రూర జంతువులు ఉన్న ప్రదేశాలు వెతుకుతూ ప్రమాదకరమైన రీల్స్ తీసుకుంటున్నారు. వారి అనాలోచిత చర్యల వల్ల వారు మాత్రమే కాకుండా పక్కన ఉన్నవారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. సోషల్ మీడియా పాపులారిటీ కోసం ప్రాణాలనే పణంగా పెట్టేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒడిశాలో ఘోర ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్న ఘటన ఒక్కసారి చూడాల్సిందే. అక్కడ కొంతమంది మైనర్లు రన్నింగ్ ట్రైన్ ముందు రీల్స్ తీసుకుంటూ, డేంజరస్ స్టంట్లు చేశారు. ఓ బాలుడు రైల్వే పట్టాల మధ్య పడుకుని, మరో ఇద్దరు అతనిని వీడియో తీస్తున్నారు. అదే సమయంలో వేగంగా ట్రైన్ వచ్చి, ఆ బాలుడి పక్కన నుంచి దూసుకెళ్లింది.
అక్కడ ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేశారు. రైలు వెళ్లిపోయిన తర్వాత అంతా సంతోషంగా అరుస్తూ, ఘనకార్యం చేసినట్టు సెలబ్రేట్ చేశారు. వీడియో చూస్తున్నవాళ్లు మాత్రం కంగారుపడుతున్నారు. బాలుడి అదృష్టమే బతికిపోయాడు, లేదంటే తీవ్ర విషాదం జరిగి ఉండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరిగినా, రైల్వేశాఖ చట్టాలు తీసుకొచ్చినా, యువత డేంజర్ స్టంట్లపై మోజు తగ్గడం లేదు. వారు చేస్తున్న పనులు క్షణిక సంతోషం ఇచ్చినా, జీవితాంతం నొప్పి మిగిలించే ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడతాయని పెద్దలు చెబుతున్నారు. సమయం ఉండగానే యువత ఇలా ప్రాణాలతో చెలగాటం ఆపాలని, బాధితుల కుటుంబాలు కోరుకుంటున్నాయి.