సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనేముందు ఈ చిట్కాలు గమనించండి..!

Second Hand Car: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి.

Update: 2022-08-23 05:30 GMT

సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనేముందు ఈ చిట్కాలు గమనించండి..!

Second Hand Car: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా తక్కువ ధరకి కొనుగోలు చేయాలంటే మూడు చిట్కాలు పాటించాలి. వీటిని అనుసరించడం వల్ల సరసమైన ధరకి కారు వస్తుంది. ఉపయోగించిన కార్ల వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండు ఉంటాయి. కాని వాటిని కొనేముందు ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

తొందరపడకండి

సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనడానికి అస్సలు తొందరపడకండి. ఎందుకంటే తొందరలో మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ చూపలేరు. దీనివల్ల మీరు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కారును కొనుగోలు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఉపయోగించిన కారుని కొనుగోలు చేసినప్పుడు అన్ని ఎంపికలని పరిశీలించండి. ఒకదానికొకటి సరిపోల్చండి. అప్పుడు మాత్రమే మంచి కారును కొనుగోలు చేయడానికి వీలుంటుంది.

లోపాలను గుర్తించండి

మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనేముందు కారుని క్షుణ్ణంగా పరీక్షించండి. అందులో ఏవైనా లోపాలు కనిపిస్తే వాటిని కారు యజమానికి ఖచ్చితంగా చెప్పండి. దీంతో పాటు ఆ లోటుపాట్లను సరిచేసేందుకు అయ్యే ఖర్చు గురించి అతడికి వివరించండి. మెరుగైన డీల్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల మీరు తక్కువ ధరకి కారుని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

బేరం చేయండి

సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలు బేరసారాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత బేరసారాలు చేయగలిగితే అంత సరసమైన ధరకి కారు లభిస్తుంది. కారును కొనుగోలు చేసేటప్పుడు మీరు అదే కారు కావాలని పట్టుబట్టకూడదు. దీనివల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. మీకు చాలా ఆప్షన్‌లు ఉంటాయి. వాటిపై కూడా ఓ లుక్కేయాలి.

Tags:    

Similar News