Viral Video: న‌డీ రోడ్డుపై రొమాన్స్‌తో రెచ్చిపోయిన క‌పుల్స్‌.. పోలీసులు ఏం చేశారంటే

Viral Video: నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ యువ జంట బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదకరమైన విధంగా ప్రవర్తించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహిరంగ ప్రదేశంలో ఓ జంట రొమాన్స్‌తో రెచ్చి పోయింది.

Update: 2025-06-17 10:20 GMT

Viral Video: న‌డీ రోడ్డుపై రొమాన్స్‌తో రెచ్చిపోయిన క‌పుల్స్‌.. పోలీసులు ఏం చేశారంటే

Viral Video: నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ యువ జంట బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదకరమైన విధంగా ప్రవర్తించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహిరంగ ప్రదేశంలో ఓ జంట రొమాన్స్‌తో రెచ్చి పోయింది. చుట్టూ ప్ర‌జ‌లున్నార‌న్న విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోకుండా రొమాన్స్‌లో మునిగితేలారు.

ఈ సంఘటనలో యువకుడు బైక్ నడుపుతుండగా యువతి అతని ముందు పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని అతడిని వెనక్కి తిరిగి హగ్ చేసుకుంది. ఆమె కాళ్లతో అతడిని పట్టుకుని నానా హంగామా చేసింది. దీనంత‌టినీ ప‌క్క‌నే వెళ్తున్న వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఈ వీడియో కాస్త వైర‌ల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజ‌న్లు ఈ జంట‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇంట్లో చేసుకోవాల్సిన ప‌నులు న‌డీ రోడ్డుపై చేయ‌డం ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది.

వైరల్ వీడియోను పరిశీలించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు, బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు గుర్తించి రూ. 53,500 జరిమానా విధించారు. ఈ జంట బైక్‌ రిజిస్ట్రేషన్ ఢిల్లీకి చెందినదిగా గుర్తించారు. నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.




Tags:    

Similar News