9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉండొద్దు.. టెలికాం శాఖ కొత్త నిబంధనలు

Telecom New Rules: దేశవ్యాప్తంగా ఒకరివద్ద 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉండొద్దని టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది...

Update: 2021-12-12 04:30 GMT

9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉండొద్దు.. టెలికాం శాఖ కొత్త నిబంధనలు

Telecom New Rules: దేశవ్యాప్తంగా ఒకరివద్ద 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉండొద్దని టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తొమ్మిది కంటే ఎక్కువ కనెక్షన్లను కలిగి ఉంటే ఆ సిమ్‌లను తిరిగి ధృవీకరించాలని తెలిపింది. జమ్మూ, కశ్మీర్‌, అస్సాం రాష్ట్రాల విషయంలో ఈ పరిమితి ఆరు కనెక్షన్లు మాత్రమే. ఒకవేళ వెరిఫికేషన్ చేయించుకోపోతే ఆ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేయాలని ఆదేశించింది. అయితే సబ్‌స్క్రైబర్‌లు తాము ఏ కనెక్షన్‌ని ఉంచుకునే నిర్ణయాన్ని వారికే వదిలేసింది. మిగిలిన వాటిని డియాక్టివేట్ చేస్తారు.

టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ఒక వ్యక్తి తొమ్మిది కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్‌లను కలిగి ఉంటే అవన్నీ మళ్లీ ధృవీకరించాలి. లేదంటే కనెక్షన్లను డియాక్టివేట్ చేస్తారు. ఆర్థిక నేరాలు, మోసపూరిత కాల్‌లు నివారించడానికి టెలికాం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం.. ఉపయోగంలో లేని అన్ని మొబైల్ కనెక్షన్‌లను డేటాబేస్ నుంచి తొలగించాలని టెలికాం ఆపరేటర్‌లను ఆదేశించింది. ఒకవేళ వినియోగదారుడు తన కనెక్షన్‌ ధృవీకరించుకుంటే పర్వాలేదు ఒకవేళ అలా చేయకపోతే అదనంగా ఉన్న కనెక్షన్లను తొలగిస్తారు. దీంతో అతని ఇన్‌కమింగ్ సర్వీస్ 45 రోజుల్లోగా రద్దవుతుంది.

సబ్‌స్క్రైబర్ రీ-వెరిఫికేషన్ కోసం రాకపోతే ఆ నంబర్ 60 రోజుల్లో డీయాక్టివేట్ చేస్తారు. డిసెంబర్ 7 నుంచి లెక్క ప్రారంభమైంది. సబ్‌స్క్రైబర్ అంతర్జాతీయ రోమింగ్‌లో ఉన్నట్లయితే లేదా శారీరక వైకల్యం ఉన్నట్లయితే లేదా ఆసుపత్రిలో ఉంటే అదనంగా మరో 30 రోజులు కేటాయిస్తారు. ఒక వ్యక్తి ధృవీకరణ కోసం రాకపోతే అతను 15 రోజుల్లో పూర్తిగా డిస్‌కనెక్ట్ చేయబడతాడు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు పేర్కొన్న పరిమితులను క్రమం తప్పకుండా వినియోగదారులకు తెలియజేస్తారు.

Tags:    

Similar News