Viral Video: కొత్త జంట చేసిన పనికి పోలీసులు ఫైర్.. భారీగా జరిమానా..!
ముందూ వెనకా ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు ప్రాణాల మీదికి తీసుకొస్తున్నాయి.
Viral Video: కొత్త జంట చేసిన పనికి పోలీసులు ఫైర్.. భారీగా జరిమానా
Viral Video: ఇటీవల కాలంలో పెళ్లి వేడుకలను ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేసుకోవాలనే ఉద్దేశంతో, జంటలు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లు, వీడియో షూట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ కావాలన్నా కారణమో, మరేంటో కానీ కొందరు హద్దులు మీరిపోతున్నారు.
ముందూ వెనకా ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు ప్రాణాల మీదికి తీసుకొస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక వధూవరుల జంట చేసిన తతంగం ఇప్పుడు వైరల్‌గా మారింది. పెళ్లి తర్వాత ఈ జంట చేసిన స్టంట్ ట్రాఫిక్ పోలీసులకు పడింది. రన్నింగ్ కారుపై వరుడు నిలబడి కత్తిని తిప్పుతుంటే వధువు కారు బోనెట్‌పై కూర్చుని పాటకు తగ్గట్లుగా డ్యాన్స్ చేసింది.
ఈ సంఘటన గ్వాలియర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. ‘ఇష్క్ కి గలీ విచ్ నో ఎంట్రీ’ పాటకు డ్యాన్స్ చేస్తూ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ శాఖ దీనిపై సీరియస్ అయింది. విచారణ చేపట్టిన అధికారులు సంబంధిత వాహనానికి భారీ జరిమానా విధించారు.
రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. గ్వాలియర్ ట్రాఫిక్ డీఎస్పీ సుబేదార్ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ, “ఇలాంటి స్టంట్లు వారి ప్రాణాలకే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగిస్తాయని తెలిపారు. వీరు చేసిన తప్పుకు శిక్ష తప్పదు అని హెచ్చరించారు.