Doomsday Fish: మ‌త్య్స‌కారుల‌కు చిక్కిన అరుదైన చేప‌.. పెరుగుతోన్న‌ భూకంప భ‌యం ?

Doomsday Fish: సముద్రాల్లో ఎన్నో అరుదైన జంతువులు జీవిస్తుంటాయి. వాటిలో ఒకటి ఒర్‌ఫిష్ (Oarfish) అనే చేప. దీని అరుదైన ఆకారం, అనూహ్యంగా కనిపించడమే కాకుండా… గతంలో జరిగిన పెద్ద ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి పలువురికి దీనిపై భయం కూడా ఉంటుంది.

Update: 2025-06-04 10:58 GMT

తాజాగా తమిళనాడు తీరంలో మత్స్యకారులు ఒక ఒర్‌ఫిష్‌ను పట్టుకున్నారు. దీని శరీరం సిల్వ‌ర్ క‌ల‌ర్‌లో మెరిసిపోతుంది. తల దగ్గర ఎరుపు రంగులో ఉన్న ఫిన్‌తో ప్రత్యేకంగా కనిపించింది. దీని పొడవు 30 అడుగుల వరకు ఉండొచ్చు. సాధారణంగా ఈ చేపలు సముద్రం లోతుల్లో 200 నుంచి 1000 మీటర్ల లోతులో ఉంటాయి. ఉపరితలానికి రావడం చాలా అరుదు.

దీనిని "Doomsday Fish" అని కూడా అంటుంటారు. 2011లో జపాన్‌లో భారీ భూకంపం, సునామీ జరగకముందు ఒర్‌ఫిష్‌లు తీరానికి వచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మెక్సికోలో ఒక భారీ భూకంపం ముందూ ఇదే చేప కనిపించిందని స్థానికులు చెబుతారు. ఈ చేప‌లు ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలోనే ఇలా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ప‌లువురు భావిస్తున్నారు. దీంతో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. సముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, లోతుల్లో జరిగే మార్పుల వల్లే ఈ చేపలు ఉపరితలానికి రావొచ్చని వారు చెబుతున్నారు. జపనీస్ పురాణాల ప్రకారం, ఒర్‌ఫిష్ భూకంపం రాబోతున్నదనే సంకేతంగా భావిస్తారు. సముద్రతలానికి చాలా లోతుల్లో ఉండే ఈ చేపలు, భూమిలోపల ఉద్భవించే ప్రకంపనలు వల్ల భయంతో పైకి వస్తాయని వారు నమ్ముతారు. అయితే ఇప్పటివరకు ఒర్‌ఫిష్‌లు భూకంపాలను ముందే కనిపెట్టగలవన్నది శాస్త్రపరంగా ఎలాంటి ఆధారం ల‌భించ‌లేదు. 

Tags:    

Similar News