Viral Video: నువ్వు అసలు మనిషివేనా.? కుక్కలు వెంటాడుతుంటే ఇదేం పని.. నెటిజెన్లు ఫైర్‌..!

Viral Video: మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం తగ్గిపోతోంది. సాటి మనిషి పట్ల కనీస గౌరవం పక్కన పెడితే జాలి కూడా లేకుండా పోతోంది.

Update: 2025-03-07 10:34 GMT

Viral Video: మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం తగ్గిపోతోంది. సాటి మనిషి పట్ల కనీస గౌరవం పక్కన పెడితే జాలి కూడా లేకుండా పోతోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిన ఓ సంఘటన చూస్తే మానవత్వం మరీ ఇంతలా దిగజారిపోయిందా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబయిలోని అంధేరీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్‌ రాత్రిపూట విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే సమయంలో వీధి కుక్కలు కొన్ని అతనిపై దాడి చేసేందకు యత్నించాయి. ఒక్కసారిగా పదుల సంఖ్యలో కుక్కలు రావడంతో చేతిలోని కర్రతో వాటిని కొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి కుక్కల నుంచి వాచ్‌మెన్‌ను రక్షించాల్సింది పోయి. వాచ్‌మెన్‌పైనే దాడికి యత్నించాడు.

కుక్కలను ఎందుకు కొడుతున్నావంటూ వాచ్‌మెన్‌పై దాడి చేశాడు. దీంతో కొన్ని కుక్కలు వాచ్‌మెన్‌ను కరిచాయి కూడా. ఒక ఆ యువకుడు కూడా వాచ్‌మెన్‌ను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో కొద్దిసేపటికే అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు కుక్కలను తరిమికొట్టారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ముంబయి పోలీసుల దృష్టిలో పడగా.. దగ్గరల్లోని పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేయాలని చూశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. వాచ్‌మెన్‌పై దాడికి దిగిన యువకుడిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు అసలు మనిషివేనా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News