Viral Video: 9 మంది పిల్లల తల్లి.. 52 ఏళ్ల వయసులో పాతికేళ్ల చిన్నోడితో పరార్.. కోర్టు ఏం చేసిందంటే!

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2025-09-12 10:06 GMT

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 32 ఏళ్ల వైవాహిక జీవితం, తొమ్మిది మంది పిల్లలను వదిలి, 52 ఏళ్ల మహిళ తన ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉసిహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖేడా జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓంపాల్, నీలం అనే దంపతులకు 9 మంది సంతానం. ఓంపాల్ ఢిల్లీలో కూలీగా పనిచేస్తుండగా, నీలం పిల్లలను, వ్యవసాయ పనులను చూసుకునేది. అంతా సవ్యంగానే ఉన్న సమయంలో, నీలం తన గ్రామానికి చెందిన 32 ఏళ్ల పప్పు యాదవ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని పారిపోయింది. అంతేకాకుండా, తనతో పాటు పదేళ్ల చిన్న కూతురిని, రూ.4 లక్షల విలువైన నగలు, రూ.50,000 నగదు, అలాగే భర్త పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల భూమి పత్రాలను కూడా తీసుకెళ్లింది.

తన 32 ఏళ్ల వైవాహిక జీవితం నాశనమైందని, కుటుంబాన్ని పోషించడానికి తాను పడిన కష్టాన్ని తన భార్య అర్థం చేసుకోలేదని ఓంపాల్ కన్నీరు పెట్టుకున్నాడు. పంట అమ్మిన డబ్బు కూడా తీసుకెళ్లడంతో అతడు మరింత ఆవేదన చెందాడు. వెంటనే అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నీలంను ఆమె ప్రియుడితో సహా కాస్గంజ్ జిల్లాలో పట్టుకున్నారు.

పోలీసుల సమక్షంలో ఓంపాల్ తన భార్యతో మాట్లాడి, జరిగినదంతా మరిచిపోయి తిరిగి ఇంటికి రమ్మని బ్రతిమాలాడు. అయితే, అందుకు ఆమె నిరాకరించింది. అనంతరం వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఆ మహిళ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను తన భర్త, పిల్లల వద్దకు తిరిగి వెళ్ళనని, తన ఇష్టప్రకారం ప్రియుడితోనే కలిసి జీవిస్తానని స్పష్టం చేసింది. తన పదేళ్ల కూతురిని కూడా తనతోనే ఉంచుకోవాలని కోరగా, కోర్టు అందుకు అంగీకరించింది. ఈ ఘటన ప్రస్తుతం ఆ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Tags:    

Similar News