Viral Video: బిడ్డ కోసం తగ్గేదేలే.. పెద్ద పులిపై ఎలుగుబంటి భీకర పోరాటం
నల్లమల అడవుల్లో మంగళవారం జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
Viral Video: బిడ్డ కోసం తగ్గేదేలే.. పెద్ద పులిపై ఎలుగుబంటి భీకర పోరాటం
Viral Video: బిడ్డ కోసం తగ్గేదేలే.. పెద్ద పులిపై ఎలుగుబంటి భీకర పోరాటం
నల్లమల అడవుల్లో మంగళవారం జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఫర్హాబాద్ ప్రాంతంలో పులి ఒక ఎలుగుబంటి పిల్లపై దాడి చేసింది. అయితే, ఇది చూసిన తల్లి ఎలుగుబంటి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ పిల్లను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పులిపై ధైర్యంగా ఎదురెళ్లింది.
పులి తడబడేంతగా గట్టిగా అరుస్తూ, దాన్ని భయపెట్టి తాను ఎత్తుకెళ్లిన పిల్లను కిందపెట్టేలా చేసింది. ఆపై పులిని తరిమికొట్టింది. ఈ ఘటన సఫారీకి వెళ్లిన పర్యాటకుల కంటపడడంతో, వారు తాము తీసుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు తల్లి ప్రేమ గొప్పదనాన్ని ప్రశంసిస్తున్నారు. ‘‘ఇది నిజమైన మాతృత్వ ధైర్యం’’, ‘‘పులిలాంటి శత్రువును ఎదుర్కొన్న ఆ తల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట తెగ ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
బిడ్డను కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించి ఎలుగు బంటి పోరాటం.. పెద్ద పులి పరార్.. pic.twitter.com/9n70ws8U8
— Mahadev Narumalla✍ (@Kurmimahadev) May 21, 2025