Viral Video : జంతువులో ఇంత భక్తా? తిండి తిప్పలు మానేసి హనుమంతుడి చుట్టూ తిరుగుతున్న శునకం
Viral Video : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఒక వింత సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Viral Video : జంతువులో ఇంత భక్తా? తిండి తిప్పలు మానేసి హనుమంతుడి చుట్టూ తిరుగుతున్న శునకం
Viral Video : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఒక వింత సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక మూగజీవి హనుమంతునిపై చూపిస్తున్న భక్తిని చూసి జనం ఇది దైవ లీల అని, సాక్షాత్తు ఆంజనేయుడి మహిమ అని నమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్, బిజ్నోర్ జిల్లాలోని నంద్‌పూర్ గ్రామంలో ఉన్న ఒక పురాతన హనుమాన్ ఆలయంలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఒక కుక్క గత మూడు రోజులుగా ఏకధాటిగా హనుమంతుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. జనవరి 12వ తేదీ ఉదయం ఆలయంలోకి ప్రవేశించిన ఈ శునకం, అప్పటి నుంచి ఆగకుండా గుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో, చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో మారుమోగిపోతోంది.
తిండి లేదు.. నీళ్లు అసలే లేవు
సాధారణంగా ఏ జంతువైనా కొన్ని గంటల పాటు తిండి లేకుంటే నీరసించిపోతుంది. కానీ, ఈ కుక్క మాత్రం గత మూడు రోజులుగా ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా విగ్రహం చుట్టూ తిరుగుతుండటం గమనార్హం. గ్రామస్తులు దాని ముందు రకరకాల ఆహార పదార్థాలు ఉంచినప్పటికీ, ఆ కుక్క వాటిని కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం భక్తి పారవశ్యంలో మునిగిపోయినట్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. దీనిని చూసిన భక్తులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. రద్దీ పెరగడంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పావురంతో వింత బంధం.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం
ఈ కథలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఆ కుక్క వీపుపై ఒక పావురం కూడా కూర్చుని ఉండేదట. కొన్ని మీడియా కథనాల ప్రకారం, ఆ పావురం కొంత సమయం తర్వాత మరణించింది. తన తోటి జీవి మరణించడంతో ఆ కుక్క ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై, కాసేపు తన ప్రదక్షిణలను ఆపేసిందని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో @diljale_shyar అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మూగజీవుల భక్తిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.