Viral Video: వామ్మో.. తిరుమల మెట్ల మార్గంలో భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో..!

Viral Video: రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, కాలనీలు జలమయమవుతున్నాయి.

Update: 2025-09-18 06:39 GMT

Viral Video: రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, కాలనీలు జలమయమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్లే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొండకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు.

టీటీడీ కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేకించి, కాలి నడక మార్గంలో అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులను గుంపులుగా వెళ్లమని సూచిస్తోంది. ఇటీవల కాలంలో ఈ మార్గంలో చిరుతలు, పాములు, కొండచిలువలు, ఎలుగుబంట్లు వంటివి తరచూ కనిపిస్తున్నాయి.

తాజాగా, అలిపిరి మెట్ల మార్గంలో సుమారు 12 అడుగుల పొడవైన భారీ కొండచిలువ కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే భక్తులు టీటీడీ విజిలెన్స్‌కు సమాచారం ఇవ్వగా, అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి కొండచిలువను జాగ్రత్తగా పట్టుకుని తిరిగి అడవిలో వదిలిపెట్టారు.


Tags:    

Similar News