Viral Video: బెడ్‌పై ఊహించని అతిథి.. వీడియో చూస్తే గుండె జారాల్సిందే
Viral Video: పాము పేరు వినగానే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది విషపూరితమైన కింగ్ కోబ్రా కనిపిస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. ఒక కాటుతో ప్రాణాలు తీసే పవర్ పాములకు ఉంటుంది.
Viral Video: బెడ్‌పై ఊహించని అతిథి.. వీడియో చూస్తే గుండె జారాల్సిందే
Viral Video: పాము పేరు వినగానే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది విషపూరితమైన కింగ్ కోబ్రా కనిపిస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. ఒక కాటుతో ప్రాణాలు తీసే పవర్ పాములకు ఉంటుంది. అందుకే వీటి దగ్గరకి వెళ్లడానికి ఎవరూ సాహసం చేయరు.
అయితే కొన్ని సందర్భాల్లో పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. అప్పుడే ఓ భారీ కింగ్ కోబ్రా పాము పాకుతూ మంచం వైపు వచ్చింది. అలాగే నెమ్మదిగా మంచంపైకి ఎక్కి, ఆ తర్వాత అతని కాళ్ల మీదుగా నెమ్మదిగా జారుకుంది.
దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తి కదలకుండా ఉండడంతో పాము నెమ్మదిగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “చూస్తుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది”, మనోడి అదృష్టం బాగున్నట్లుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ భయానక వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.