Viral Video: కరెంట్ లేకుండా తిరిగే ఫ్యాన్.. మనోడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
ఫ్యాన్ తిరగాలంటే కచ్చితంగా కరెంట్ ఉండాలని తెలిసిందే.
Viral Video: కరెంట్ లేకుండా తిరిగే ఫ్యాన్.. మనోడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
ఫ్యాన్ తిరగాలంటే కచ్చితంగా కరెంట్ ఉండాలని తెలిసిందే. అయితే కరెంట్ అవసరం లేకుండా ఫ్యాన్ తిరిగితే ఎలా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ ఔత్సాహికుడు దీనిని నిజంగా చేసి చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిన్న కర్ర ముక్కలు, బేరింగ్‌లు, ఇనుప కడ్డీ, రబ్బర్లు, బోల్టులు వంటి వాటితో ఒక ఫ్యాన్‌ను తయారు చేశాడు. మొదట చెక్కను నిలబెట్టి దానిలో ఓ రంధ్రం చేశాడు. ఆ రంధ్రంలో బేరింగ్‌ను అమర్చాడు. ఆ బేరింగ్ ద్వారా ఇనుప రాడ్‌ను ఉంచి, దానికి ఫ్యాన్ రెక్కలను ఫిట్ చేశాడు. మరోవైపు మరో చెక్కను అడ్డంగా అమర్చి, అందులో రబ్బర్లను త్రిభుజాకారంగా కట్టాడు.
ఆ రబ్బర్లు, రాడ్‌కు తగిలే విధంగా అమర్చారు. ఫ్యాన్‌ను చేత్తో ఒకసారి తిప్పగానే, ఆ రబ్బర్ల కారణంగా ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది. అలా తిరుగుతూ, కరెంట్ లేకుండానే గాలి ఇస్తోంది. ఈ వీడియో చూస్తే "ఇదెలా సాధ్యమయ్యిందబ్బా!" అనిపించేలా ఉంటుంది. విద్యుత్ లేకుండా ఫ్యాన్ పనిచేయడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ప్రశంసలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇది పర్ ఐడియా’’, ‘‘ఇతని ట్యాలెంట్‌కి సెల్యూట్ చెప్పాల్సిందే’’ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.