Viral Video: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. కొండ అంచున కార్‌తో స్టంట్ చేద్దామనుకుంటే..

Viral Video: సోషల్ మీడియా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రచారం కోసం కొందరు ప్రమాదకర విన్యాసాలకు తెగబడుతున్నారు.

Update: 2025-07-14 05:36 GMT

Viral Video: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. కొండ అంచున కార్‌తో స్టంట్ చేద్దామనుకుంటే..

Viral Video: సోషల్ మీడియా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రచారం కోసం కొందరు ప్రమాదకర విన్యాసాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర సతారా జిల్లాలో ఓ వ్యక్తి చేసిన స్టంట్ తీరని ప్రమాదాన్ని మిగిల్చింది.

గుజర్వాడి గ్రామంలోని ఎత్తైన కొండపై ఓ యువకుడు తన కారుతో జీరో కట్ స్టంట్ చేయబోయాడు. ఈ సమయంలో అదుపుతప్పిన కారు 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. కారులో ఉన్న కరాడ్ తాలూకాకు చెందిన సాహిల్ అనిల్ జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వేల మంది వీక్షించి, వందలాది లైక్స్, కామెంట్స్‌తో వైరల్‌ చేశారు.

కొంత మంది నెటిజన్లు.. "ప్రజాదరణ కోసం ఇలా సాహసాలు చేయడం జీవితానికి ముప్పు" అని వ్యాఖ్యానించగా, "పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు కచ్చితంగా ఉండాలి" అని మరికొందరు సూచించారు. ఈ ఘటన మరోసారి అతివేగం, ప్రమాదకర స్టంట్ల ప్రమాదాలపై హెచ్చరికగా నిలిచింది.


Tags:    

Similar News