Viral Video : బుడతడి మ్యాజిక్ అదిరింది..ఒక్క క్షణంలో కాయిన్ మాయం చేసి షాక్ ఇచ్చాడు!

Viral Video : మాయాజాలం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అది కూడా ఒక చిన్న పిల్లాడు మ్యాజిక్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక బుడతడికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Update: 2026-01-10 10:30 GMT

Viral Video : బుడతడి మ్యాజిక్ అదిరింది..ఒక్క క్షణంలో కాయిన్ మాయం చేసి షాక్ ఇచ్చాడు!

Viral Video : మాయాజాలం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అది కూడా ఒక చిన్న పిల్లాడు మ్యాజిక్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక బుడతడికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. రాజస్థానీ తలపాగా పెట్టుకుని, వీధిలో నిలబడి ఈ బుజ్జాయి చేస్తున్న మ్యాజిక్ చూసి సామాన్యులే కాదు, విదేశీయులు కూడా నోరెళ్లబెడుతున్నారు. విదేశీ పర్యాటకులని ఆశ్చర్యపరచడమే కాకుండా, వారితో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఈ చిన్నారి మ్యాజీషియన్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి సాంప్రదాయ రాజస్థానీ తలపాగా ధరించి కనిపిస్తున్నాడు. రోడ్డు పక్కన పర్యాటకులను ఆకర్షిస్తూ, తన చేతిలో ఉన్న నాణెం, వేణువుతో అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నాడు. ఆ చిన్నారి వయస్సు తక్కువే అయినా, అతడు మ్యాజిక్ ప్రదర్శిస్తున్న తీరు చూస్తుంటే ఎంతో అనుభవజ్ఞుడైన కళాకారుడిలా అనిపిస్తుంది. అతని ఆత్మవిశ్వాసం చూసి అక్కడున్న వారందరూ చప్పట్లతో ముంచెత్తుతున్నారు.



అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ పిల్లాడు అక్కడ ఉన్న విదేశీ పర్యాటకులతో ఇంగ్లీష్‌లో మాట్లాడటం. అతడికి పెద్దగా చదువు లేకపోయినా, తన మ్యాజిక్ రూల్స్ ని వారికి అర్థమయ్యేలా ఇంగ్లీష్‌లో వివరిస్తున్నాడు. ఆ పదాలు పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ఎదుటివారికి తన విషయాన్ని చేరవేయడంలో మాత్రం నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. ఒక పర్యాటక ముష్టిలో నాణెం పెట్టి, అది కాసేపటికే పక్కనే ఉన్న మరో పర్యాటకుడి వద్దకు వెళ్లేలా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

కాయిన్ గాలిలో మాయం చేయడం, మళ్లీ ఇంకో చోట నుంచి ప్రత్యక్షం చేయడం వంటి ట్రిక్స్ చూపిస్తూ ఆ చిన్నారి అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులను చేశాడు. @bheel_jagdeesh98 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ అయిన ఈ వీడియో చూసిన నెటిజన్లు.. "టాలెంట్‌కు వయస్సు, చదువుతో పనిలేదు" అని కొనియాడుతున్నారు. తన జీవనోపాధి కోసం చేస్తున్నా, ఆ పని పట్ల అతడికున్న శ్రద్ధ, ఆత్మవిశ్వాసం ఈ వీడియోను మరింత ప్రత్యేకం చేశాయి.

Tags:    

Similar News