Holi celebrations: హోలీ అంటే రంగుల వేడుక మాత్రమే కాదు.. తీపి జ్ఞాపకాలను పంచుకునే వేదిక కూడా..
Holi celebrations: హోలీ అంటే రంగులు చల్లుకోవడం ఒకటే కాదు కుటుంబమంతా తమ తీపి జ్ఞాపకాలను పంచుకునే ఒక చక్కని అవకాశం కూడా
Holi celebrations
Holi celebrations: హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు. ఇది సంబంధాలను తిరిగి నింపుకోవడానికి, మనస్సును ఉత్తేజపరిచేందుకు.. మానసిక స్థితిని తేలికపరచడానికి ఒక అవకాశం. మనస్తత్వశాస్త్రం- నాడీశాస్త్రంలో పరిశోధనలు మనం కుటుంబం, స్నేహితులతోకలిసినపుడు.. వారితో గడిపినపుడు.. వారితో కలిసి హాయిగా నవ్వినప్పుడు.. అలాగే, మంచి అనుభవాలను పంచుకున్నప్పుడు, డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి "మంచి అనుభూతి" హార్మోన్లు మెదడులో సక్రియం అవుతాయని చెబుతున్నాయి.
క్రమం తప్పకుండా అందరితో మమేకం కావడం, మాట్లాడడం వంటి మానసిక కార్యకలాపాలు వృద్ధుల ఆలోచన, జ్ఞాపకశక్తి , తార్కిక సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంటే, హోలీ వంటి పండుగలు కేవలం సంప్రదాయాలు మాత్రమే కాదు. మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరమైనవి. ఆనందాన్ని పెంచడానికి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఈ హోలీ రోజున ఇలా చేసి చూడండి..
మీ అనుభవాలను పంచుకోండి..
ఇంటిలో పెద్దవారు వారి కాలంలో పువ్వుల నుండి రంగులు ఎలా తయారు చేసేవారో ఇంట్లో చిన్నవారికి చెప్పండి. సాంప్రదాయంగా ఇంట్లో తయారుచేసిన పిండి వంటలను పంచుకోండి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి.
పెద్దలు యువ తరాలతో అనుభవాలను పంచుకోవడం వల్ల మానసిక సంతృప్తి పెరుగుతుందని మనస్తత్వశాస్త్రం సూచిస్తుంది. పెద్దలతో చిన్నవారు కుటుంబంలోని చిన్న వారితో గడపడం వలన సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. వారి ఒంటరితనం తగ్గుతుంది.
డ్రై హోలీ ఆడండి
రసాయన రంగులు, నీటిని నివారించండి. పొడి, మూలికా గులాల్ మీ సన్నిహితుల నుదుటన తిలకంలా దిద్దండి. వారిని హగ్ చేసుకోండి. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి. మీకు రక్తపోటు లేదా గుండె జబ్బులు ఉంటే, ఎక్కువసేపు నిలబడకుండా ఉండండి.
సామాజిక స్పర్శ - కౌగిలించుకోవడం.. చేతులు పట్టుకోవడం - ఆక్సిటోసిన్ విడుదలై ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) ను తగ్గిస్తుంది. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. సంబంధాలను పెంచుతుంది.
సమతుల్య ఆహరం తీసుకోండి
స్వీట్లు తినండి, కానీ పరిమితంగా తీసుకోండి. రోజంతా స్వీట్లు, వేయించిన ఆహారాలను నివారించండి. సాధారణ నీరు, కొబ్బరి నీరు లేదా తక్కువ చక్కెర కలిగిన ఇంట్లో తయారుచేసిన పానీయం త్రాగండి.
సమతుల్య ఆహారం వేడుకల ఆనందాన్ని పెంచుతుంది. ఇది మీ రక్తపోటు - చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. పుష్కలంగా నీరు, ఇంట్లో తయారుచేసిన పానీయాలు తాగడం వల్ల డీహైడ్రేషన్ ఉండదు.
పాత ఫోటోలతో జ్ఞాపకాలు పంచుకోండి..
హోలీ జరుపుకునేటప్పుడు కొత్త ఫోటోలు తీయించుకోండి. అలాగే, మీ పాత ఆల్బమ్‌లను తీసి మీ కుటుంబంతో కూర్చుని ఆ ఫోటోలకు సంబంధించిన కథలను పంచుకోండి.
సానుకూల జ్ఞాపకాలను తిరిగి చూసుకోవడం వలన జ్ఞాపకశక్తి .. భావోద్వేగ సమతుల్యతలో పాల్గొనే మెదడులోని భాగాలు సక్రియం అవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మానసిక చురుకుదనాన్ని కాపాడుతుంది.
పండగ అంటేనే తరువాతి తరాలకు మన సంస్కృతిని కానుకగా అందించడం. అలాగే మన ముందు తరాల నుంచి మన సంప్రదాయాల విలువలను తెలుసుకోవడం. హొలీ పండుగ సందర్భంగా పెద్దలు తమ పిల్లలకు అనుభవాలను పంచండి. ఆ అనుభవాలను చక్కని ఎదుగుదలకు సోపానాలుగా పిల్లలు మార్చుకునే అవకాశం కల్పించండి.