Viral Video: చిరుత పులికి చుక్కలు చూపించిన పందులు.. వైరల్ వీడియో
Viral Video: అడవిలో జరుగే అనూహ్య సంఘటనలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. ముఖ్యంగా క్రూరమృగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఓ చెట్టుపై చిరుత కూర్చొని ఉంది. పందుల గుంపు ఒక చిరుతను టార్గెట్ చేసింది. చిరుతను గమనించిన అడవి పందులు గుంపులుగా చుట్టుముట్టాయి. వెంటనే అప్రమత్తమైన చిరుత చెట్టు ఎక్కింది. చెట్టు చుట్టూ చేరిన పందులు చిరుత ఎప్పుడు దిగుతుందా అని ఎదురు చూశాయి.
ఒక్కసారి చెట్టు కిందికి వచ్చిన చిరుతపై ఒక్కసారిగా పందులన్నీ అటాక్ చేశాయి. అయితే రెప్పపాటు క్షణంలో చిరుత మళ్లీ చెట్టు పైకి ఎక్కేసింది. అలా పందుల నుంచి చిరుత తప్పించుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతటి బలవంతమైన చిరుత పులికి, పందుల నుంచి ఇబ్బంది తప్పలేదంటూ కొందరు కామెంట్ చేయగా. సమిష్టి కృషి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చనే సందేశం ఈ వీడియోలో దాగి ఉంది అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.