January Holidays 2026: జనవరిలో లాంగ్ వీకెండ్స్.. సంక్రాంతి కాకుండా వరుసగా సెలవులే సెలవులు..!
January Holidays 2026: సెలవులు అంటే విద్యార్థులకే కాదు, ఆఫీసు పనులతో బిజీగా ఉండే ఉద్యోగులకు కూడా ఎంతో ఉత్సాహాన్నిస్తాయి.
January Holidays 2026: జనవరిలో లాంగ్ వీకెండ్స్.. సంక్రాంతి కాకుండా వరుసగా సెలవులే సెలవులు..!
January Holidays 2026: సెలవులు అంటే విద్యార్థులకే కాదు, ఆఫీసు పనులతో బిజీగా ఉండే ఉద్యోగులకు కూడా ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ప్రస్తుత డిసెంబర్ నెలలో క్రిస్మస్ సెలవుల సందడి ఉండగానే, రాబోయే 2026 జనవరి నెల భారీ సెలవులతో స్వాగతం పలుకుతోంది. ముఖ్యంగా రెండు సార్లు 'లాంగ్ వీకెండ్స్' రానుండటంతో టూర్లకు వెళ్లాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్.
ప్రస్తుతం డిసెంబర్ కావడంతో విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు మొదలవుతున్నాయి. క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలకు వారం రోజులకు పైగా సెలవులు ప్రకటించారు. క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు, ఫ్యామిలీ ట్రిప్పులకు ఈ సమయం అనుకూలంగా ఉండటంతో పర్యాటక ప్రాంతాలన్నీ రద్దీగా మారనున్నాయి.
కొత్త ఏడాది ప్రారంభంలోనే రెండు సార్లు అదిరిపోయే లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. న్యూ ఇయర్ ధమాకా (జనవరి 1 - 4):
జనవరి 1 (గురువారం): నూతన సంవత్సర సెలవు. జనవరి 2 (శుక్రవారం): ఈ ఒక్క రోజు సెలవు పెడితే చాలు..జనవరి 3, 4 (శని, ఆదివారాలు) తో కలిపి మొత్తం వరుసగా 4 రోజులు సెలవులు దొరుకుతాయి.
రిపబ్లిక్ డే వీకెండ్ (జనవరి 23 - 26):
జనవరి 24 (శనివారం), జనవరి 25 (ఆదివారం) సాధారణ సెలవులు. జనవరి 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (పబ్లిక్ హాలిడే).
ఒకవేళ జనవరి 23 (శుక్రవారం) వసంత పంచమి రోజున సెలవు తీసుకుంటే.. ఇక్కడ కూడా వరుసగా 4 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.
సంక్రాంతి సెలవుల జాతర
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే సెలవుల పండగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నేపథ్యంలో దాదాపు వారం రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఊళ్లకు వెళ్లే వారికి, సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే వారికి జనవరి నెల ఒక చిరస్మరణీయమైన నెలగా మారనుంది.