Viral Video: జపాన్‌లో హెయిర్ కట్ ఎలా చేస్తారో తెలుసా.? జీవితంలో ఒక్కసారైనా చేయించుకోవాల్సిందే
Viral Video: గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం చుట్టేస్తూ ఎన్నో కొత్త అనుభవాలను పొందడం చాలామందికి సాధ్యమైంది. ఇప్పుడు విదేశాల్లోకి వెళ్లి చిన్నచిన్న పనులు చేయించుకోవడం కూడా చాలా కామన్‌గా మారింది. కేవలం షాపింగ్ కోసం విదేశాలకు వెళ్తున్న వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

అందులోనూ సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎక్కడ ఎలాంటి వింతలు ఉన్నా క్షణాల్లో అరచేతిలో వాలిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
జపాన్‌లో ఓ వ్యక్తికి హెయిర్‌కట్ చేసే వీడియో వైరల్ అవుతోంది. అందులో మహిళా బార్బర్ అతడికి కట్, హెయిర్ వాష్, షేవింగ్, ఫేషియల్, మసాజ్ వంటి సేవలన్నీ చేసింది. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. జపాన్‌లో హెయిర్ కట్ చేయించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి, జీవితంలో ఒక్కసారైనా హెయిర్ కట్ చేయించుకోవాల్సిందే అంటూ రాసుకొచ్చారు.
దీంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజంగానే ఈ హెయిర్ సెలూన్ చాలా అద్భుతంగా ఉందంటూ కొందరూ స్పందిస్తే మరికొందరు మాత్రం ఇంత మాత్రం దానికి జపాన్ వెళ్లాలా.. మా ఊరిలో ఇంతకంటే బాగా చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.