దేశంలో శాకాహారులు, మాంసాహారుల లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

National Family Health Survey: కొన్ని విషయాలలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ అని చెప్పవచ్చు.

Update: 2022-10-04 10:55 GMT

దేశంలో శాకాహారులు, మాంసాహారుల లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

National Family Health Survey: కొన్ని విషయాలలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ అని చెప్పవచ్చు. UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో శాకాహారులు ఉన్న దేశం భారతదేశం. శాకాహారుల ప్రపంచ ర్యాంకింగ్‌లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. హర్యానా, రాజస్థాన్ అత్యధిక సంఖ్యలో శాకాహారులు నివసించే రాష్ట్రాలు.

అయితే నాన్ వెజ్ తినడంలో భారతీయ మహిళలు వెనుకంజ వేయలేదు. దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు నాన్ వెజ్ తింటున్నారు. వీరిలో చాలా మంది తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే దేశంలో అత్యధిక శాకాహారులు ఉత్తర, మధ్య భారతదేశంలో నివసిస్తున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లలో అత్యధిక శాఖాహారులు ఉన్నారు.

తూర్పు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం మాంసాహారాన్ని ఇష్టపడుతారు. వీటిలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దక్షిణ భారతంలో శాకాహారులు, మాంసాహారులు సమభాగంలో ఉన్నారు. అయితే ఇటీవల జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది శాకాహారానికి మారుతున్నారు. ఎందుకంటే మాంసాహారం వల్ల వ్యాధులకి గురయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News