Current Bill: చలికాలంలో పెరిగిన కరెంట్‌ బిల్లులు.. ఈ చిట్కాలతో తగ్గించే ప్రయత్నం చేయండి..!

Current Bill: చలికాలంలో పెరుగుతున్న కరెంటు బిల్లుతో ఇబ్బంది పడుతుంటే కొన్ని చిట్కాలు అనుసరించి తగ్గించుకోండి.

Update: 2023-01-09 15:30 GMT

Current Bill: చలికాలంలో పెరిగిన కరెంట్‌ బిల్లులు.. ఈ చిట్కాలతో తగ్గించే ప్రయత్నం చేయండి..!

Current Bill: చలికాలంలో పెరుగుతున్న కరెంటు బిల్లుతో ఇబ్బంది పడుతుంటే కొన్ని చిట్కాలు అనుసరించి తగ్గించుకోండి. దేశంలోని అనేక ప్రాంతాల్లో బలమైన చలి విద్యుత్ వినియోగాన్ని పెంచింది. ఎందుకంటే అధిక చలిని నివారించేందుకు గదులలో హీటర్లు, గీజర్లు, వాటర్ హీటర్ల వాడకం బాగా పెరిగింది. వీటిని ఉపయోగించడం వల్ల కరెంటు మీటర్ల వేగం కూడా పెరిగింది. జనవరి నెలలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు వెచ్చదనం కోసం విద్యుత్‌ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తోంది.

భోగి మంట

కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి, డబ్బు ఆదా చేయడానికి గదిలోని ఏదైనా మూలలో భోగి మంటను వేయండి. రోజంతా హీటర్‌ను నడపడం వల్ల కరెంటు బిల్లు పెరుగుతుంది. కాబట్టి భోగి మంటల వేసి తగ్గించుకోండి. ఇందుకోసం ఇంటి లోపల ఒక స్థలం కేటాయించండి. హీటర్కు బదులుగా ఈ మంటని ఉపయోగించండి. దీంతో విద్యుత్ మీటర్ వేగాన్ని తగ్గించవచ్చు.

గీజర్ వాడకం తగ్గించండి

మీరు ఎల్లప్పుడూ నీటిని వేడి చేయడానికి గీజర్‌ని, వాటర్‌ హీటర్‌ని ఉపయోగిస్తుంటే కరెంట్‌ బిల్లు బాగా పెరుగుతుంది. వీటిని వారంలో రెండు మూడు రోజులు ఉపయోగించకండి. గ్యాస్‌పై నీటిని వేడి చేయండి. దీంతో విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చు. గీజర్‌ని ఉపయోగించడం వల్ల పవర్ యూనిట్ చాలా వేగంగా పెరుగుతుంది.

కిటికీలు, తలుపులు మూసి ఉంచండి

శీతాకాలంలో ఇంటి ఉష్ణోగ్రతను మెయింటెన్‌ చేయడానికి కిటికీ, తలుపులను ఎల్లప్పుడూ మూసి ఉంచండి. ఇంట్లో నుంచి గాలి బయటికి వెళ్లనప్పుడు అలాగే బయటిగాలి ఇంట్లోకి రానప్పుడు ఇంటి ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. చలి ఎక్కువగా ఉండదు. తక్కువ వెలుతురులో ఎక్కువ కాంతిని ఇచ్చే విద్యుత్ దీపాలను వాడాలి. దీంతో సులువుగా కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు.

Tags:    

Similar News