Car Driving: కారు డ్రైవింగ్‌ చేసేవారికి అలర్ట్‌.. ఈ విధంగా గేర్‌ మారిస్తే మైలేజ్‌పై ఎఫెక్ట్‌..!

Car Driving: ప్రతి ఒక్కరూ తమ కారు మంచి మైలేజీని ఇవ్వాలని కోరుకుంటారు.

Update: 2022-11-22 11:19 GMT

Car Driving: కారు డ్రైవింగ్‌ చేసేవారికి అలర్ట్‌.. ఈ విధంగా గేర్‌ మారిస్తే మైలేజ్‌పై ఎఫెక్ట్‌..!

Car Driving: ప్రతి ఒక్కరూ తమ కారు మంచి మైలేజీని ఇవ్వాలని కోరుకుంటారు. కానీ కొందరు కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. దీని కారణంగా ఇంజన్‌పై ఎఫెక్ట్‌ పడుతుంది. దీంతో వాహనం మైలేజీని తగ్గుతుంది. కారు గేర్లని మార్చే పద్దతి కూడా ఇంజిన్‌ని ప్రభావితం చేస్తుంది. ప్రజలు తరచుగా చేసే కొన్ని తప్పుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. క్లచ్ నొక్కడం

ఏదైనా మాన్యువల్ కారులో గేర్‌లను మార్చడానికి ముందుగా క్లచ్‌ను తొక్కాలి. కానీ కొందరు క్లచ్‌ను పూర్తిగా తొక్కరు. తొందరలో గేర్‌లను మారుస్తారు. ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకూడదు. దీని వల్ల కారు గేర్ సరిగా మారక ఇంజన్ పై ఒత్తిడి ఏర్పడుతుంది.

2. త్వరగా గేర్ షిఫ్ట్

ఒక గేర్ నుంచి మరొక గేర్‌కి మారడానికి ఎప్పుడూ తొందరపడకూడదు. సరిపోయే స్పీడ్‌ మెయింటెన్‌ చేయకుండా గేర్‌లను మార్చినట్లయితే ఇంజిన్ పై ఎఫెక్ట్‌ పడుతుంది. మైలేజ్ భారీగా తగ్గుతుంది.

3. కారణం లేకుండా గేర్ మార్చడం

కారణం లేకుండా గేర్ మార్చడం వల్ల వాహనం మైలేజ్ తగ్గుతుంది. తరచుగా గేర్ మారడం వల్ల ఇంజిన్ వేడెక్కుతుంది. ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కారు గేర్‌ని మార్చాలి.

4.  సరైన వేగం

మీరు తక్కువ గేర్‌లో కారును వేగంగా నడిపితే ఇంధనం ఎక్కువగా మండుతుంది. కారు RPM ప్రకారం ఎల్లప్పుడూ గేర్‌ను మార్చాలి. 1200 నుంచి 2000 RPM వరకు మాత్రమే ఏదైనా గేర్‌లో బండిని నడపాలి. దీని కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే గేర్ మార్చాలి.

Tags:    

Similar News