Car Tire: కారు టైరులో ఎంత గాలి ఉండాలి.. ఈ విషయం చాలామందికి తెలియదు..!

Car Tire: చాలామంది నిత్యం కార్లలో ప్రయాణిస్తారు కానీ కారు టైర్లలో ఎంత గాలి మెయింటెన్ చేయాలో తెలియదు.

Update: 2022-11-09 03:32 GMT

Car Tire: కారు టైరులో ఎంత గాలి ఉండాలి.. ఈ విషయం చాలామందికి తెలియదు..!

Car Tire: చాలామంది నిత్యం కార్లలో ప్రయాణిస్తారు కానీ కారు టైర్లలో ఎంత గాలి మెయింటెన్ చేయాలో తెలియదు. కొంతమంది డ్రైవర్లకి కూడా దీనిపై అవగాహన లేదు. దీనివల్ల ఒక్కోసారి ప్రమాదాలు తలెత్తుతాయి. వాస్తవానికి వివిధ రకాల కార్ల టైర్లకు వివిధ రకాల లిమిట్‌ ఉంటుంది. 40PSI పీడనం కొన్ని టైర్లకు సరైనది అయితే కొన్నింటికి ఎక్కువ లేదా తక్కువ అవుతుంది. మీ కారు టైర్లలో ఎంత గాలి ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సాధారణంగా కార్ల టైర్లను బట్టి 30PSI నుంచి 40PSI వరకు గాలి పెట్టవచ్చు. ఉదాహరణకు ఆల్టో 800కి 30 పిఎస్‌ఐ, సెలెరియోకి 36 పిఎస్‌ఐ, వ్యాగన్ఆర్‌కి 33 పిఎస్‌ఐ, శాంట్రోకి 35 పిఎస్‌ఐ, ఐ20కి 30-32 పిఎస్‌ఐ, వెర్నాకు 33 పిఎస్‌ఐ, థార్ 30-35 పిఎస్‌ఐలను మెయింటెన్ చేయవచ్చు. అలాగే స్కార్పియో టైర్లలో 35-40 PSI, హోండా సిటీ టైర్లలో 30-35 PSI, అమేజ్ టైర్లకు 30 PSI, ఫార్చ్యూనర్ కోసం 35 PSI, ఇన్నోవా క్రిస్టా కోసం 36 PSI ఉంచవచ్చు.

టైర్ నాణ్యత, బలాన్ని బట్టి పీడన స్థాయిలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అయితే కారు ఖచ్చితమైన టైర్ ప్రెజర్ స్థాయిని తెలుసుకోవాలనుకుంటే కారు వినియోగదారు మాన్యువల్‌ని చూడవలసి ఉంటుంది. చాలా వాహనాల్లో డ్రైవర్ డోర్ లోపలి భాగంలో టైర్ ప్రెజర్ సమాచారం రాసి ఉంటుంది. ఇక్కడ ఒక స్టిక్కర్ అతికించి ఉంటుంది. ఇది ముందు వెనుక టైర్ల సరైన ఒత్తిడి స్థాయిని చూపుతుంది.

Tags:    

Similar News