HMTV Anniversary: పుష్కరోత్సవం!

Update: 2021-02-12 06:10 GMT

హెచ్ఎంటీవీ పుష్కరోత్సవం 

వార్తా ప్రపంచం చాలా పెద్దది. అందులోనూ తెలుగు వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వార్తా ప్రపంచంలో పన్నెండేళ్ళ క్రితం అడుగుపెట్టిన hmtv ఒక్కో అడుగూ ప్రజల పక్షాన.. ప్రజల నేస్తంగా సాగుతోంది. పన్నెండేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రతి నిమిషం.. నిజం వైపే నిలిచింది hmtv. వాస్తవాలను వెలికి తీయడంలో.. వాటిని ప్రజలముందు ఉంచడంలో hmtv ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. వార్తా చానెళ్లు ప్రహసనంగా మారిపోతున్న రోజుల్లో.. రాజకీయ విషయాల పైనే మీడియా దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో జన పదమే తన పథంగా హ్మ్ట్వ్ ముందుకు సాగింది. వార్తా విశేషాలకు పెద్ద పీట వేస్తూనే.. జానపద కార్యక్రమాలకు.. వినోద విశేషాలకూ.. అన్నిటినీ మించి తెలుగు సాహిత్య సంస్కృతికి ప్రాధాన్యతను ఇస్తూ వస్తోంది. hmtv పుట్టిన రోజు ఏ విధమైన ప్రామిస్ ప్రేక్షకులకు చేసిందో.. పుష్కర కాలంగా అదే బాటలో పయనిస్తోంది. 

పుష్కర కాలం చిన్నదేమీ కాదు. అందులోనూ మీడియాకు. ప్రతి రోజూ ఒక పరీక్షే. ప్రతి మాసమూ సవాళ్ళ సవారీనే.. ప్రతి వత్సరమూ సరికొత్త అనుభవమే. పన్నెండేళ్ళలో ప్రతి సంవత్సరం నేర్చుకుంటున్న అనుభవాల సోపానాల పై ప్రజల హృదయాల వేదికపై నిత్య నూతనంగా ఉండేందుకు కృషి చేస్తూనే వస్తోంది hmtv.

పన్నెండు వత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుపుకుంటున్న సంబరాల సందర్భంగా hmtv ఉన్నతికి శ్రమించిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తోంది. ఆదరించి అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ సాదర వందనాలు సమర్పిస్తోంది hmtv.  ప్రజల నమ్మకం.. ప్రేమను నిలబెట్టుకునేందుకు పునరంకితం అవుతామని ఈ సందర్భంగా అందరికీ మరోసారి ప్రామిస్ చేస్తోంది మీ hmtv .

Full View

Tags:    

Similar News