Viral Video: హిమాచల్‌ బస్సు ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్‌ అవుతున్న జర్నీ వీడియో..!

Himachal Pradesh bus Video: కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ ప్రకృతిని ఆస్వాదించడం ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం. అయితే ఈ కొండ ప్రాంతాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడైనా ప్రయాణం చేశారా? ఒక్కసారి హిమాచల్ ప్రదేశ్ ఈ వైరల్ వీడియో చూడండి.

Update: 2025-03-14 09:08 GMT

Viral Video: హిమాచల్‌ బస్సు ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్‌ అవుతున్న జర్నీ వీడియో..!

Himachal Pradesh Bus Journey Viral Video

హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు వెళుతున్న రూటు చాలా ప్రమాదకరంగా ఉంది. ఆ రోడ్డు అతి చిన్నగా.. ప్రమాదకరంగా ఉంది. ఒక్క అడుగు అటూ ఇటూ అయినా ప్రాణాలు గాల్లోకే.. ఒక పక్క కొండ మరోపక్క పారుతున్న నది కనిపిస్తోంది. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కొండ ప్రాంతాల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయడం ప్రతి ఒక్కరికి ఇష్టం. టూరిస్టులను కూడా ఆకర్షిస్తుంది. అయితే ఈ బస్సు ప్రయాణం చూస్తే మాత్రం ఒళ్లుగగుర్పొడుస్తుంది. ఎందుకంటే బస్సు ఏ మాత్రం డ్రైవర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీటిలో పడిపోవడం క్షణం మాత్రం కూడా ఆలస్యం కాదు. ఈ హిమాచల్ ప్రదేశ్ బస్ జర్నీ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది

హిమాచల్ ప్రదేశ్ టూరిస్టులకు గమ్యస్థానం.. అందమైన కొండలు ఆ ప్రాంతాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే ఎక్కువ శాతం మంది ఆ ప్రాంతాల్లోని లొకేషన్స్ వెళ్తారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో ప్రయాణం చేయాలని ఉందా? అని ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది హిమాచల్ డ్రైవర్స్ 'అల్ట్రా ప్రో మాక్స్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కొంతమంది థ్రిల్లింగ్‌ ఉంది.. అంటే మరికొందరు ఈ హిమాచల్ ప్రదేశ్ బస్సు డ్రైవర్లు ఓజీలు అంటూ రాసుకొచ్చారు. ఈ బస్సు ప్రయాణం మేము కూడా చేశాం.. చాలా భయంకరంగా ఉంటుంది, కానీ అద్భుతంగా కూడా కనిపిస్తుంది అని రాసుకొచ్చారు. కొంతమంది లొకేషన్ గురించి అడగ్గా హిమాచల్ ప్రదేశ్ టౌన్ అని రిప్లై వచ్చింది. అయితే ఈ క్లిప్పు మాత్రం చంబా నుంచి పంజీ వెళ్లే రూట్ లో ఉంటుందని మరి కొంతమంది కామెంట్ చేశారు. సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు త్వరగా వైరల్‌ అవుతాయి. దానికి రకరకాలుగా కామెంట్లు కూడా పెడుతుంటారు. జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.


Tags:    

Similar News