Viral Video : మృత్యువు ఒడిలో ఉండి కూడా బిడ్డల కోసం ఏడ్చిన తండ్రి..ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు చూస్తుంటాం, కానీ కొన్ని వీడియోలు మన మనసును పిండేస్తాయి. అలాంటి ఒక అత్యంత బాధాకరమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Viral Video : మృత్యువు ఒడిలో ఉండి కూడా బిడ్డల కోసం ఏడ్చిన తండ్రి..ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు చూస్తుంటాం, కానీ కొన్ని వీడియోలు మన మనసును పిండేస్తాయి. అలాంటి ఒక అత్యంత బాధాకరమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ, మృత్యువు ముంగిట ఉన్న ఒక తండ్రి తన బిడ్డలకు వీడ్కోలు పలుకుతున్న దృశ్యం చూస్తే ఎంతటి వారికైనా కన్నీళ్లు ఆగవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక తండ్రి సైనోవియల్ సార్కోమా అనే అరుదైన, ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధితో ఆసుపత్రి బెడ్‌పై పోరాడుతున్నాడు. వైద్యులు కూడా ఇక ఏమీ చేయలేమని చేతులెత్తేసిన తరుణంలో, తన భార్య, చిన్నారి పిల్లలకు ఆ తండ్రి చివరిసారిగా వీడ్కోలు పలుకుతున్న తీరు లక్షలాది మంది నెటిజన్లను ఏడిపిస్తోంది. మృత్యువు తనను తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నా, తన పసి బిడ్డలను వదిలి వెళ్లలేక ఆ తండ్రి పడ్డ ఆరాటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ వీడియోలో ఒక చిన్నారి తన తండ్రికి ఏమైందో తెలియక, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన గుండెలపై పడుకుని ఉంది. ఆ తండ్రి కళ్లలో నీళ్లు ధారగా కారుతున్నాయి. తన గారాల పట్టిని ఇక చూడలేనన్న బాధ, ఆమెకు లోకంలోని సంతోషాలన్నీ ఇవ్వలేకపోతున్నానన్న వేదన ఆయన కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. తన కూతురి నుదుటిపై పదే పదే ముద్దులు పెడుతూ, ఆ కొన్ని క్షణాల్లోనే జీవితకాలపు ప్రేమను అందించాలని ఆయన ప్రయత్నిస్తున్న తీరు నెటిజన్ల మనసులను కలిచివేస్తోంది.
తన కొడుకు దగ్గరకు రాగానే ఆ తండ్రి సహనం కోల్పోయి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించినా, గొంతు వరకు వచ్చిన మాటలు వ్యాధి వల్ల కలిగిన బలహీనతతో ఆగిపోయాయి. వీడియో చివర్లో భార్య తన భర్తను గట్టిగా హత్తుకుంటుంది. బహుశా అదే ఆయన ఆఖరి శ్వాస కావొచ్చు. తన ఆత్మీయుల కౌగిలిలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు ఆ దృశ్యాలు చెబుతున్నాయి. @AntiapeShit అనే X ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. "ఆ సమయంలో ఆయన ఒక్కటే కోరుకుని ఉంటాడు.. జీవించడానికి ఒక్క అవకాశం ఇవ్వమని. కుటుంబం పక్కన ఉన్నప్పుడే ప్రాణాలు వదలడం ఆయనకు కలిగిన చిన్నపాటి ఊరట" అని ఒకరు కామెంట్ చేయగా, "నిజమైన బలం అంటే అత్యంత కష్టమైన వీడ్కోలును కూడా ప్రేమతో భరించడమే" అని మరొకరు రాశారు. "జీవితం చాలా విలువైనది మిత్రులారా, ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపండి.. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు" అంటూ మరికొందరు జీవిత సత్యాన్ని గుర్తు చేస్తున్నారు.