Viral Video : నోరు ఉండి కూడా ముక్కుతో తింటోంది..ఈ అమెరికా భామ వింత వేషాలు చూశారా ?

Viral Video : ప్రపంచంలో వింతలకి కొదువ లేదు. కొందరు చేసే పనులు చూస్తే అసలు వీళ్లు మనుషులేనా? అనిపిస్తుంది. సాధారణంగా మనం ఏదైనా రుచి చూడాలంటే నోటిని వాడతాం.

Update: 2026-01-13 07:00 GMT

Viral Video : నోరు ఉండి కూడా ముక్కుతో తింటోంది..ఈ అమెరికా భామ వింత వేషాలు చూశారా ?

Viral Video : ప్రపంచంలో వింతలకి కొదువ లేదు. కొందరు చేసే పనులు చూస్తే అసలు వీళ్లు మనుషులేనా? అనిపిస్తుంది. సాధారణంగా మనం ఏదైనా రుచి చూడాలంటే నోటిని వాడతాం. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం అందరిలా నోటితో కాకుండా ముక్కుతో ఆహారం తీసుకుంటోంది. వినడానికే ఎంతో వింతగా, జుగుప్సాకరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

అమెరికాలోని వర్జీనియాకు చెందిన క్యాథరిన్ అనే మహిళ తన వింత ఆహారపు అలవాటుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈమె గత ఐదేళ్లుగా నోటితో ఒక్క ముద్ద కూడా తినడం లేదట. ప్రతి రోజూ తను తీసుకునే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా అన్నీ ముక్కు ద్వారనే లోపలికి పంపిస్తోంది. ఈ వింత కథ వెనుక ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. క్యాథరిన్ కాలేజీలో ఉన్నప్పుడు తన స్నేహితులతో కలిసి ఒక పందెం వేసింది. ఆ పందెంలో గెలవడానికి మొదటిసారి ముక్కుతో ఫ్రూట్ జ్యూస్ తాగడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెకు తల తిరిగినట్లు అనిపించినా, ఒక రకమైన కొత్త కిక్కు, రుచి తెలిసాయట. అది కాస్తా కాలక్రమేణా అలవాటుగా మారి, ఇప్పుడు వ్యసనంగా పరిణమించింది.


క్యాథరిన్ డైట్ ప్లాన్ వింటే ఎవరికైనా వాంతి వచ్చినంత పనవుతుంది. ఈమె ఆమ్లెట్, పాలకూర, స్టీక్ ముక్కలు, మష్రూమ్స్.. ఇలా ఏది తినాలన్నా ముందుగా వాటిని మిక్సీలో వేసి మెత్తటి ద్రవంలా మారుస్తుంది. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక ట్యూబ్ లేదా సిరంజి సహాయంతో ముక్కు ద్వారా లోపలికి పంపిస్తుంది. మెక్సికన్ స్పెషల్ డిష్ గువాకామోలే నుంచి కాఫీ వరకు అన్నీ ముక్కు ద్వారానే ఆమె పొట్టలోకి వెళ్తాయి. ఇలా చేయడం వల్ల గొంతులో ఆహారం అడ్డుపడుతుందనే భయం ఉండదని ఆమె వింత వాదన చేస్తోంది. ఈ విషయం తెలిసి ఆమె ప్రియుడు జస్టిన్ కూడా షాక్ అయ్యాడు. ఆమె ముక్కుతో తింటుంటే చూడలేక అసహ్యించుకుంటున్నానని అతను బహిరంగంగానే చెప్పాడు.

అయితే ఈ వింత అలవాటు ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారం పొరపాటున శ్వాసనాళాల్లోకి వెళ్తే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా నిమోనియా వచ్చే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా కారంగా ఉండే మసాలాలు ముక్కులోని సున్నితమైన పొరలను దెబ్బతీస్తాయని, దీనివల్ల ప్రాణాపాయం కూడా కలగవచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. కానీ క్యాథరిన్ మాత్రం ఈ అలవాటును వదులుకోలేకపోతోంది. "డాక్టర్లు చెప్పేది వింటే భయమేస్తోంది, కానీ నాకు ఇది ఒక వ్యసనంలా మారిపోయింది.. ఇక అంతా నా అదృష్టం మీదే వదిలేశాను" అని ఆమె అంటోంది. నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి "కలికాలం అంటే ఇదేనేమో" అని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News