Nails And Hair: మరణం తర్వాత కూడా జుట్టు, గోళ్లు పెరుగుతాయా.. ?

Nails And Hair: మరణం తరువాత శరీరంలోని అన్ని భాగాలు పనిచేయడం ఆగిపోతాయి. రక్త ప్రసరణ లేకుండా శరీరం చల్లబడుతుంది. హృదయ స్పందన ఆగిపోతుంది. మెదడు పని చేయదు.

Update: 2025-06-03 15:34 GMT

Nails And Hair: మరణం తర్వాత కూడా జుట్టు, గోళ్లు పెరుగుతాయా.. ?

Nails And Hair: మరణం తరువాత శరీరంలోని అన్ని భాగాలు పనిచేయడం ఆగిపోతాయి. రక్త ప్రసరణ లేకుండా శరీరం చల్లబడుతుంది. హృదయ స్పందన ఆగిపోతుంది. మెదడు పని చేయదు. ఊపిరితిత్తుల పనితీరు ఉండదు. కానీ మరణం తరువాత కూడా ఒక వ్యక్తి గోర్లు, వెంట్రుకలు కొంతకాలం పెరుగుతాయని పరిశోధనలో తేలింది. నివేదిక ప్రకారం, మరణం తరువాత శరీరంలో నీరు కోల్పోవడం వల్ల శరీరం మొత్తం ఎండిపోతుంది. చర్మం దాని మెరుపును కోల్పోతుంది. వేళ్లు కూడా మారుతాయి. కానీ, గోర్లకు ఏమీ కాదు. అవి ఇంకా పెరుగుతాయని తెలుస్తోంది.

అదేవిధంగా, వెంట్రుకలు కొంచెం పొడవుగా పెరుగుతాయని అంటున్నారు. చర్మం ఎండిపోయినప్పుడు గోర్లు, వెంట్రుకలు ఎక్కువగా కనిపిస్తాయని, మరణం తక్షణమే సంభవించినప్పటికీ శరీరంలోని ప్రక్రియలు కొంతకాలం కొనసాగుతాయని అంటున్నారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు కణాలు వెంటనే చనిపోతాయి. కానీ శరీరంలోని కొన్ని ఇతర కణాలు కొంతకాలం జీవించి శరీరంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించి పనిచేస్తూనే ఉంటాయి. అందువల్ల గోర్లు, వెంట్రుకలు కొంతకాలం పొడవుగా పెరుగుతాయని అంటారు.

శరీరంలో కొన్ని ప్రక్రియలు మరణం తర్వాత కూడా కొనసాగుతాయి. ఈ ప్రక్రియలు ఆగిపోవడానికి సమయం పట్టవచ్చు. మెదడు క్రియారహితంగా ఉన్న తర్వాత కూడా గోర్లు, వెంట్రుకల పెరుగుదల సాధారణం. మరోవైపు, మరణం తర్వాత గోర్లు, వెంట్రుకలు పెరగడం ఎందుకు ఆగిపోతాయంటే నివేదికల ప్రకారం గోర్లు, వెంట్రుకల పెరుగుదలకు కొత్త కణాల ఉత్పత్తి అవసరం. దీనికి గ్లూకోజ్ అవసరం. మరణం తర్వాత శరీరంలో గ్లూకోజ్ అందుబాటులో ఉండదు. దీని కారణంగా గోర్లు, వెంట్రుకలు పెరగడం ఆగిపోతాయి.

Tags:    

Similar News