Viral Video: గొరిల్లా, పులి మధ్య భీకర పోరు.. వీడియో అదిరిపోయింది కానీ అసలు ట్విస్ట్ అదే
Viral Video: అడవిలో జంతువుల మధ్య పోరు జరగడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా రెండు బలమైన శత్రువుల మధ్య జరిగే పోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Viral Video: గొరిల్లా, పులి మధ్య భీకర పోరు.. వీడియో అదిరిపోయింది కానీ అసలు ట్విస్ట్ అదే
Viral Video: అడవిలో జంతువుల మధ్య పోరు జరగడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా రెండు బలమైన శత్రువుల మధ్య జరిగే పోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిన తర్వాత ఊహకందని విషయాలను కూడా వీడియో రూపంలో మార్చేస్తున్నారు. చివరికి జంతువుల మధ్య పోరాటాన్ని కూడా ఏఐ రూపంలోకి మార్చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఒక గొరిల్లా, పెద్దపులిపై దాడి చేసిన వీడియోను ఏఐ సహాయంతో రూపొందించారు. మొదట ఇది నిజంగా జరిగిన సంఘటన అని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనిస్తే మాత్రం అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన వీడియో అని స్పష్టమవుతోంది.
wildanimaldiscussion_20 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో ఈ వీడియోను పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐతో సినిమాలు కూడా వస్తాయి కావొచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.